మీటూ ఉద్యమ ప్రారంభంలో ఒక ప్రముఖ దర్శకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసిన అందాల కథానాయిక గ్లామర్ ప్రపంచంలో వేవ్స్ క్రియేట్ చేసింది. అప్పట్లో సదరు దర్శకుడిపై విచారణ కూడా కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ భామ తన ప్రేమాయణం గురించి, అత్యాచార ఘటన గురించి వెల్లడించి ప్రపంచానికి షాకిచ్చింది. తనను ఒక క్రికెటర్ ప్రేమించి వదిలేశాడని షాకింగ్ ఆరోపణలు చేసింది. ఇంతకీ ఎవరీ భామ? అంటే.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన పాయల్ ఘోష్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన `ఊసరవెల్లి` చిత్రంలో నటించిన పాయల్ ఘోష్.. మంచు మనోజ్ `ప్రయాణం`లోను నటించింది. ఈ భామ ఇప్పుడు తన గతానుభవాలపై బహిరంగంగా వ్యాఖ్యానించింది. ప్రముఖ పార్లమెంటేరియన్ గౌతమ్ గంభీర్ తనకు తరచూ ఫోన్ చేసేవాడని, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే తాను ప్రేమించే వ్యక్తి అని వెల్లడించింది. X (గతంలో ట్విట్టర్)లో పాయల్ ఇలా వ్రాశారు. “గౌతమ్ గంభీర్ ముజే రెగ్యులర్ గా మిస్కాల్ దేతే ది, యే ఇర్ఫాన్ కో బోహోత్ అచ్చి తా రహ్ పటా థా, వో మేరా సబ్ కాల్స్ చెక్ కర్తా థా .. వో యే బాత్ మేరే సామ్నా యూసుఫ్ భాయ్, హార్దిక్ ఔర్ కృనాల్ పాండ్యా కో భీ బటాయా థా జబ్ మెయిన్ ఇర్ఫాన్ కో పూణే మే మిల్నే గయీ థీ.. దేశీయ మ్యాచ్ థా బరోడా కా“ అని రాయగా, మరో ట్వీట్‌లో “మేరే పిచ్ఛే #గౌతమ్‌గంభీర్ #అక్షయ్‌కుమార్ సబ్ పదే హ్యూ ది లేకిన్ మెయిన్ ప్యార్ సిర్ఫ్ ఇర్ఫాన్ పఠాన్ సే కార్తీ థీ, ముఝే ఉస్కే ఇలాబా కోయి ఔర్ దిఖ్తా హీ నహీ థా ఔర్ మెయిన్ ఇర్ఫాన్ కాహిఅబ్స్కో, మిస్కల్ దిఖాతీ భీ థీ… మైనే బాస్ ఇర్ఫాన్ సే ప్యార్ కియా ఔర్ కిసీసే భీ నహీ…!!!“ అని రాసింది.
ఇర్ఫాన్ నేను విడిపోయిన తర్వాత … నేను అనారోగ్యానికి గురయ్యాను .. నేను సంవత్సరాల తరబడి పని చేయలేకపోయాను … కానీ నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి అతడు … ఆ తర్వాత నేను ఎవరినీ ప్రేమించలేదు. అని అంది. ఇర్ఫాన్ పఠాన్ కబ్ తక్ ముహ్ పే దహీ జమాకే రఖోగే… కభీ తో మేరే కామ్ ఆవో అని చెప్పింది. “ఇర్ఫాన్ మేరా బాయ్‌ఫ్రెండ్ పెహ్లే థా .. మేము 2011 నుండి డేటింగ్ చేసాము. ఔర్ ఇస్మే షాదీ 2016 మే కియా …“ అని పాయల్ రాశారు. 2020లో సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై జరిగిన లైంగిక వేధింపుల గురించి పాయల్ మాట్లాడింది. 2014లో అనురాగ్ తన ముందు బట్టలు విప్పి వేధించడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొంది. అయితే పాయల్ తనపై చేసిన లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలన్నింటినీ కశ్యప్ కొట్టిపారేశాడు.
ఇప్పుడు మరోసారి అనురాగ్ కశ్యప్‌పై ఆరోపించింది. లేకిన్ ఏక్ బాత్ ఔర్ భీ హై…. #అనురాగ్‌కశ్యప్ నన్ను వేధించాడు లేకిన్ ఔర్ కోయి మత్లాబ్ #అక్షయ్‌కుమార్ కీ జూటీ భీ నహీ హై అనురాగ్… కానీ అక్షయ్ కుమార్ నే మేరే సాథ్ కోయి బద్దమీజీ నహీ కి, ఇత్నా స్టార్ ఐ బాదా… దాని కోసం అతన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాను.. అని రాసింది. పఠాన్‌తో కలిసి ఉన్న సమయంలో గౌతమ్ గంభీర్ తనకు తరచుగా మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడని ఆమె తన X ప్రొఫైల్‌లో పేర్కొంది. అతనికి ఈ విషయం స్పష్టంగా తెలుసు అని కూడా పేర్కొంది.