క్లిక్‌ క్లిక్‌ : విరుష్క జోడీ వార్షికోత్సవం ఇలా..

టీం ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అనుష్క శర్మ వివాహ బంధంలో అడుగు పెట్టి అప్పుడే ఆరు ఏళ్లు అవుతోంది. తాజాగా వీరు ఆరవ వార్షికోత్సవం స్నేహితులు మరియు సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

డిసెంబర్‌ 11న విరుష్క జోడీ వివాహం వార్షికోత్సవం జరుపుకున్న నేపథ్యం లో సోషల్‌ మీడియాలో వీరి జోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్షల కొద్ది మెసేజ్ లు అందాయి. ఇక బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు ప్రముఖ క్రీడాకారులు కూడా విరుష్క జోడీకి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

సన్నిహితులు మరియు బంధువుల సమక్షంలో విరుష్క జోడీ కేక్‌ కట్‌ చేసి తమ వార్షికోత్సవంను జరుపుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ, అనుష్క వార్షికోత్సవ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీరి వైవాహిక జీవితం ఎప్పటికీ ఇంతే సంతోషంగా, ఆనందంగా ఉండాలని అభిమానులు కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

విరాట్‌ కోహ్లీ, అనుష్క లకు 2021 జనవరి 11న కుమార్తె జన్మించింది. ఆ పాపకి వామిక అనే పేరు పెట్టడం జరిగింది. మొత్తానికి ఎప్పటికప్పుడు విరుష్క జోడీ మరియు వామిక గురించి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్షికోత్సవ ఫోటోలతో విరుష్క దంపతులు వైరల్‌ అవుతున్నారు.