ఖాన్‌ల‌ను వెన‌క్కి నెట్టి ప్ర‌భాస్ నం.1 స్థానంలో

భార‌త‌దేశంలో గొప్ప ప్ర‌జాద‌రణ పొందుతున్న స్టార్ ఎవ‌రో స‌ర్వేలు నిర్ధారిస్తున్నాయి. తాజాగా అందిన రిపోర్ట్ ప్ర‌కారం ప్ర‌భాస్ దేశంలో నంబ‌ర్‌-1 స్టార్ గా రికార్డుల‌కెక్కారు. జూన్ నెలలో ఓర్మాక్స్ మీడియా జాబితా ప్రకారం ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన హీరోగా ప్రభాస్ జనాదరణ చార్టులలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఘనత అతని తాజా చిత్రం `కల్కి 2898 AD` భారీ విజయంతో సాధ్య‌మైంది.

ప్రభాస్ 2024 మే నెలలోను అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా జాబితాలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ రెండవ స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉండ‌గా, రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. క‌థానాయిక‌ల్లో ఆలియా భట్ అగ్రస్థానంలో ఉండగా, సమంత రూత్ ప్రభు, దీపికా పదుకొనే తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తాజా రిపోర్ట్ ప్ర‌జ‌ల్లో ప్రభాస్ విస్తృత ఆకర్షణ, ప్రభావాన్ని ఎలివేట్ చేస్తోంది. క‌థానాయ‌కుడిగా అత‌డికి ఉన్న ఆద‌ర‌ణ ఎలాంటిదో, ఛ‌రిష్మా ఎలాంటిదో కూడా ఆవిష్క‌రిస్తోంది. జాతీయ స్థాయిలో ఖాన్‌ల త్ర‌యం, క‌పూర్ లు, రోష‌న్‌లు ఒక‌ప్పుడు అని కూడా నిరూపిస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన `కల్కి 2898 AD` ప్ర‌భాస్ స్థాయిని అమాంతం పెంచింది. రాజ‌మౌళి త‌ర్వాత ఈ ఘ‌న‌త నాగ్ అశ్విన్ కే ద‌క్కుతుంది. రాజ‌మౌళి త‌ర్వాత ప్ర‌భాస్ ఎంపిక చేసుకున్న బెస్ట్ డైరెక్ట‌ర్ కూడా నాగ్ అశ్విన్ అని చెప్పాలి. మ‌ధ్య‌లో ప్ర‌శాంత్ నీల్ కూడా స‌లార్ తో అత‌డి స్థాయిని పెంచాడు.


Recent Random Post: