గాళ్స్ ని ఎలా పటాయించాలో? దిల్ వాలే నేర్పిందా బాస్!

రాక్ స్టార్ రణబీర్ కపూర్ లో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే రాక్ స్టార్ తన ట్యాలెంట్ ని చూపించాడు. ఆరంభంలోనే హీరోయిన్లతో ఎఫైర్లు…గాళ్స్ లో ఫాలోయింగ్ వంటి అంశాలు రణబీర్ ని కొత్తగా ప్రజెంట్ చేసాయి. అతగాడికి రొమాంటిక్ ఇమేజ్ ఏర్పడిందంటే వ్యక్తిగతంగా తనలో ఇంటర్నల్ స్కిల్స్ కొన్ని దొహదం చేసాయనే చెప్పాలి.

మరి ఈ స్కిల్స్ అన్ని రణబీర్ కి ఎక్కడ నుంచి నేర్చుకున్నాడు? అతగాడి స్పూర్తి ఎవరు? అంటే కొద్దో గొప్పో షారుక్ ఖాన్ అని రణబీర్ వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే షారుక్ ఖాన్ పై తన అభిమానాన్ని సందర్భం చిక్కినప్పుడల్లా నిరూపించుకున్నాడు. తాజాగా గాళ్స్ ని లాక్ చేసే ఓ టాప్ సీక్రెట్ ని రివీల్ చేసి మరోసారి సర్ ప్రైజ్ చేసాడు. అదేంటో రాక్ స్టార్ మాటల్లోనే విందాం..

‘మా తరానికి నిర్వచనంలా నిలిచిన చిత్రం ‘దిల్ వాలే దుల్హనియా’. ఆ సినిమా చూసినప్పుడును నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేను. సినిమా గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ అదే అనుభూతి కల్గుతుంది. ఆ సినిమా నాపై ఎంతో ప్రభావం చూపుతుంది. వ్యక్తిగతంగా నేను ఛేంజ్ అవ్వడానికి ఆ సినిమా ఎంతో దోహదం చేసింది.

నా లుక్…నడక…ఆహార్యం..డ్రెస్సింగ్ ప్రతీది నాలో మార్పు తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే అమ్మాయితో ఎలా ఉండాలో? ఎలా నడుచుకోవాలా? ఎలా మాట్లాడాలి? వాళ్లు ఎలా ఆలోచిస్తారు? వంటి విషయాలు సైతం ఆ సినిమా చూసిన తర్వాతే అర్ధమైంది. అప్పటివరకూ ఉన్న రణబీర్ వీరు..ఆ సినిమా రిలీజ్ తర్వాత రణబీర్ వేరు. ఇవన్నీ నన్ను దగ్గరగా చూసిన వారికి బాగా తెలుసు.

సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ విషయాల్ని చెబుతున్నాను. లేదంటే ఎప్పటికీ నాలో దాచేసుకునే వాడిని. కానీ ఇలాంటివి బయటకు చెబితే మరింత మందికి స్ఫూర్తిగా కనిపిస్తాయి’ అని చెప్పుకొచ్చారు. అపూర్వ ప్రేమకథా చిత్రాల సృష్టి కర్త యశ్ చోప్రా నిర్మిస్తున్న డాక్యుమెంటరీ సిరీస్ ‘ది రొమాంటిక్స్’ లో తన అనుభవాల్ని ..అభిప్రాయాల్ని పంచుకున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ విషయాల్ని పంచుకోవడం విశేషం.