గుంటూరు కారం.. ఇది ఆడియో అసలు కథ!

ఇంతకాలం షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన గుంటూరు కారం ఎట్టకేలకు ఇటీవలే చిత్రీకరణను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ సినిమా దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియెన్స్, అభిమానుల ముందుకు వచ్చేలా షెడ్యూళ్లను రెడీ చేసుకుంటూ ముందుకెళ్తోంది.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలోని పాటలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిసింది. పర్ఫెక్ట్ కమర్షియల్ ఆల్బమ్ లా సిద్ధం చేస్తున్నారట. ఈ చిత్రంలో రెండు మెయిన్ సాంగ్స్, ఓ థీమ్ సాంగ్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం అందింది.

ఓ సాంగ్.. మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ లిరిక్స్ రాసి అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిస్తున్నారట. ఓ డ్యూయెట్ సాంగ్ కూడా ఉంటుందని తెలిసింది. స్పెషల్ సాంగ్.. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ టైప్ లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా 4 నుంచి 5 సాంగ్స్ , రెండు థీమ్స్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని సమాచారం అందింది.

అయితే ఆ మధ్యలో మహేశ్ బాబు పుట్టినరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తారని ప్రచారం సాగింది. కానీ మూవీటీమ్ అలా చేయలేదు. కేవలం పోస్టర్స్ తోనే సరిపెట్టింది. అయితే ఈ సారి ఫస్ట్ సింగిల్ ను వచ్చే నెలలో పక్కాగా విడుదల చేసేలా మేకర్స్ ట్రై చేస్తున్నారట. ఇదంతా అనుకున్నట్లు ఇలానే జరిగితే మహేశ్ బాబుకు దూకుడు తర్వాత పక్కా కమర్షియల్ హిట్ ఆల్బమ్ అవుతుందనే చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస రీసెంట్ గా సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకుని షూటింగ్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్ మున్నపెన్నడూ కనిపించని సరికొత్త మాస్ లుక్ లో కనిపించబోతున్నారని మూవీటీమ్ చెబుతోంది.