సమంత హీరోయిన్ గా నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘యశోద’. సరోగసీ మాఫియా నేపథ్యంలో సాగే మెడికల్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీని మొత్తం ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు.
నవంబర్ 11న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. టైటిల్ పాత్రలో యశోదగా నటించిన సమంత ఈ పాత్రని ఛాలెంజింగ్ తీసుకుని పోరాట ఘట్టాలు డాగ్ ఛేజ్ సీన్స్ లో ఎలాంటి డూప్ లేకుండా నటించిందట. ఒక విధంగా తను ఈ మూవీ కోసం ప్రాణం పెట్టిందని నిర్మాత దర్శకులు చెబుతున్నారు. సినిమాలో సమంత డాగ్ నేపథ్యంలో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్ ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ‘యశోద’ సినిమాకు ప్రధాన యుఎస్పీ. అయితే అనుకున్నంతగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. సుమతో కలిసి ఓ వీడియో ఇంటర్వ్యూ లో మాత్రమే పాల్గొన్న సమంత మిగతా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోవడం ఈ సినిమాకు కొంత మైనస్ గా మారే అవకాశం వుంది. సామ్ అనారోగ్య పరిస్థితి సినిమాపై కొంత సింపతీ క్రియేట్ అయ్యేలా చేసినా మరో విధంగా అయితే మాత్రం మేకర్స్ ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసిందని చెప్పక తప్పదు.
ఇదిలా వుంటే ఇప్పడు ‘యశోద’ టీమ్ తరహాలోనే మరో టీమ్ సామ్ విషయంలో కంగారు పడుతోందట. సమంత సెంట్రిక్ రోల్ లో నటించిన తొలి మైథలాజికల్ డ్రామా ‘శాకుంతలం’. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. పైగా ఐమాక్స్ 3డీ ఫార్మాట్ లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు ప్రధాన బలం సమంతనే.
ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి సమంతనే కారణం అనే టాక్ వినిపిస్తోంది. గ్రాఫీక్స్ ఓ కారణం అని చెబుతున్నా అసలు కారణం సమంతనే అని ఇన్ సైడ్ టాక్. సమంత ఎంత త్వరగా కోలుకుంటే అంత మంచిదని ‘శాకుంతలం’ అంత త్వరగా పూర్తవుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాని లార్జ్ స్కేల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న గుణశేఖర్ ఈ మూవీ భారంత మొత్తం సమంతపైనే వేసినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే ఇప్పడు గుణశేఖర్ టీమ్ టెన్షన్ పడుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.