గేమ్ చేంజర్.. రాజుగారి కష్టాన్ని చూసిన రావిపూడి!

దిల్ రాజు బ్యానర్ నుంచి 2025 సంక్రాంతికి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గేమ్ చేంజర్’ ఒకటి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మరొకటి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోంది కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చేస్తుందనే ధీమాతో దిల్ రాజు ఉన్నారు.

అయితే ఆయన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో హై ప్రొడక్షన్ వేల్యూస్ తో ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఏకంగా 2 ఏళ్ళకి పైగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఎట్టకేలకు శంకర్ ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటే ఒక క్రేజ్ ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా అతని ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డ్ మెగా ఫ్యాన్స్ ని భయపెడుతుంది.

అయితే శంకర్ మూవీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. విజువల్ ని గ్రాండ్ గా చూపించే ప్రయత్నం చేస్తాడు. పిక్చరైజేషన్ కూడా ఇతర దర్శకులకి భిన్నంగా శంకర్ శైలి ఉంటుంది. శంకర్ సినిమా అంటే తెరపై చాలా గ్రాండ్ నెస్ కనిపిస్తుంది. ‘గేమ్ చేంజర్’ లో కూడా అలాంటి గ్రాడ్ నెస్ ఉండబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లో అనిల్ రావిపూడి ‘గేమ్ చేంజర్’ సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. సాధారణంగా ఏ దర్శకుడైనా నా సినిమా పెద్ద హిట్టవ్వాలి అనే కోరుకుంటాడు. కానీ రాజుగారి కష్టాన్ని చూసిన అనిల్ ఆ సినిమానే మరింత పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నారు. ఒక విధంగా నిర్మాత కష్టాన్ని అనిల్ దగ్గరుండి చూసినట్లు ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది.

‘దిల్ రాజు గారు ప్రాణం పెట్టి, భారీగా ఖర్చు పెట్టి ‘గేమ్ చేంజర్’ సినిమా చేశారు. ఎక్కువ టైమ్ ఆ సినిమా కోసమే వెచ్చించారు. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కంటే ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. కచ్చితంగా అవుతుంది..’ అని అనిల్ తెలిపారు. సంక్రాంతికి వస్తోన్న మూడు సినిమాలలో రెండు దిల్ రాజు నిర్మించినవి అయితే ‘డాకు మహారాజ్’ కి ఆయన డిస్టిబ్యూటర్ గా చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు ఆయనవే.

అందుకే దిల్ రాజు గారిని సంక్రాంతి రాజు అనాలి. ఈ సీజన్ మొత్తం ఆయనదే అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ‘గేమ్ చేంజర్’ ఆయన కెరియర్ లోనే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా దిల్ రాజుతో పాటు దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ కెరియర్ లో చాలా కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పాలి. మరి ఈ చిత్రంతో వారు ఎలాంటి సక్సెస్ ని సొంతం చేసుకుంటారో చూడాలి.