అక్కినేని హీరో నాగచైతన్య మళ్ళీ వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. అతనికి ఏదో ఒక విధంగా కాంబినేషన్ సెట్ అయితే గానే సరైన సక్సెస్ పడడం లేదు. ఈమధ్య వచ్చిన కస్టడీ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. ఆ సినిమా తమిళంలో కూడా విడుదలైంది. కానీ అక్కడ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమీ రాలేదు.
ఇక అంతకుముందే నాగచైతన్య థాంక్యూ ద్వారా అతిపెద్ద డిజాస్టర్ చూసిన నాగచైతన్య మళ్లీ కస్టడీతో కూడా అదే తరహాలో చేదు అనుభవం ఎదుర్కోవడంతో ఇప్పుడు నెమ్మదిగా అడుగులు వేయాలని అనుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా తదుపరి సినిమా ఫైనల్ చేసుకోవాలి అని చూస్తున్నాడు. అయితే చందు మొండేటి దర్శకత్వంలో చేయబోయే సినిమా మాత్రం హై బడ్జెట్ లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ప్రేమమ్ బిగ్ హిట్ కాగా.. ఆ తరువాత వచ్చిన సవ్యసాచి డిజాస్టర్ అయ్యింది. ఇక మూడవ సారి చేయబోయే సినిమా కథ గురించి కూడా ఇప్పుడు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి పాకిస్తాన్ తీరం వరకు సంబంధం ఉండే ఒక పెద్ద స్పాన్ ఉన్న అంశాన్ని తెరపైకి తీసుకు రానున్నారట. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక చందు మొండేటి ఇదివరకే కార్తికేయ 2 సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాన్ని అయితే అందుకున్నాడు. ఇక ఈ సినిమాను కూడా అతను అదే తరహాలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ నాగచైతన్య మాత్రం అటు తమిళంలోనూ ఆ మధ్య బాలీవుడ్ లోనూ వరుసగా డిజాస్టర్స్ అయితే ఎదుర్కొన్నాడు.
హిందీలో అతను అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చడ్డా సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా ఎలాంటి క్రేజ్ ఇవ్వలేదు. ఇక చందు మొండేటి అయితే కార్తికేయ 2 తో నార్త్ లోనే ఎక్కువగా క్రేజ్ అందుకున్నాడు. అలాగే మిగతా భాషల్లో కూడా మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ అని పేరు వచ్చింది. కాబట్టి చైతూతో చేయబోయే సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందా అని ఫ్యాన్స్ మత్కడుకుంటున్నారు. చూడాలి మరి ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారో.