చరణ్ కోసం ఆచార్యలో ఆ రెండూ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం కూడా తెల్సిందే. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియో అందరినీ ఆకట్టుకుంది. అందులో రామ్ చరణ్ కు ఇచ్చిన బిల్డప్ మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ కాకుండా చరణ్ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యలో ఒక కీలక పాత్రలో నటించనున్న విషయం తెల్సిందే. ఈ పాత్ర ఆచార్యకు చాలా కీలకమని కొరటాల శివ ఇటీవలే హైప్ ఇచ్చారు.

దాదాపు 30 నిమిషాల పాటు ఈ పాత్ర తెరపై కనిపిస్తుందని, రామ్ చరణ్, చిరంజీవి మధ్య సన్నివేశాలు సినిమాకు అతిపెద్ద బలంగా నిలుస్తాయని నమ్ముతున్నారు. చిరంజీవికి జోడిగా ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నటిస్తోన్న విషయం తెల్సిందే. అలాగే రామ్ చరణ్ పాత్రకు కూడా ఒక హీరోయిన్ ఉంటుందని కొరటాల శివ చెప్పారు. అది ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదని అన్నారు.

ఇక తాజాగా ఈ పాత్ర విషయంలో తెల్సిన విషయమేమిటంటే ఇందులో రామ్ చరణ్ కు రెండు పాటలుంటాయని అంటున్నారు. ఒకటి తన హీరోయిన్ తో కాగా మరొకటి ఎమోషనల్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ రెండు పాటలు రామ్ చరణ్ కు చాలా ప్లస్ అవుతాయని అంటున్నారు. ఆచార్యను ఒక చక్కటి యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా కొరటాల శివ మలుస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలియజేసాయి.