సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకుంది. సమంత కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా శాకుంతలం నిలిచింది. మూవీలో ఆ పాత్రకి సమంత సెట్ కాలేదనే విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉంటే శాకుంతలం రిలీజ్ కి ముందే నిర్మాత నటుడు త్రిపురనేని చిట్టిబాబు సమంత మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఆమె ఇమేజ్ పడిపోయింది అని అయితే మూవీస్ కి ప్రేక్షకులని రప్పించడం కోసం సెంటిమెంట్ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. శాకుంతలం మూవీ డిజాస్టర్ అవుతుందని కామెంట్స్ చేశారు. ఇక చిట్టిబాబు కామెంట్స్ కి సమంత పేరు మెన్షన్ చేయకుండా కౌంటర్ ఇచ్చింది. కొంతమందికి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ అయిపోవడంతో చెవులలో వెంట్రుకలు వస్తాయంట అని గూగుల్ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.
ఇక ఈ కామెంట్స్ పై చిట్టిబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సమంత అనారోగ్యం అనేది కేవలం సెంటిమెంట్ డ్రామా మాత్రమే అని ఆ మాటకి కట్టుబడి ఉన్నా అంటూ ప్రస్తావించారు. అదే సమయంలో తన గురించి తప్పుగా మాట్లాడితే చాలా విషయాలు బయటపెడతా అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. చిట్టిబాబు కామెంట్స్ చేసిన రెండు రోజుల్లోనే సమంత ఇంస్టాగ్రామ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటో షేర్ చేశారు.
మాయోసైటిస్ కి హైపర్ బారిక్ థెరపీ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ థెరపీతో శరీరంలో డ్యామేజ్ టిష్యూలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ ఫోటోలో సమంత నోటికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఉంది. ఈ ఫోటో చూసిన వారిలో కొంతమంది ఇది కూడా సమంత సెంటిమెంట్ డ్రామా అని కొట్టిపడేస్తూ ఉన్నారు.
అయితే మాయోసైటిస్ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుందని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలని సమంతకి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏదో మ్యాకప్ వేసుకొని నవ్వుతూ కనిపిస్తే శరీరంలో ఉన్ననొప్పి తగ్గినట్లు కాదని అంటున్నారు. చిట్టిబాబుకి సమంత కరెక్ట్ గా ఈ ఫోటోతో సమాధానం చెప్పిందని చర్చించుకుంటున్నారు.