చినిగిన చొక్కాతో సురేఖ మెడలో చిరు తాళికట్టిన వేళ!


చిరంజీవిగా కెరీర్ ప్రారంభించి మెగాస్టార్ గా ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టి నేడు నీరాజనాలు అందుకుంటున్నారా? అంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంది. ఇంతింతై వటుడింతైన చందంగా చిరంజీవి సినిమా రంగంలో ఎదిగారు.`పునాది రాళ్ల`తో మొదలైన చిరంజీవి ప్రస్థానం `సైరా నరసింహారెడ్డి` వరకూ ఎంతో స్ఫూర్తిని నింపుతుంది. ఇక కెరీర్ లో ఎదుగుతోన్న సమయంలో చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంట అల్లుడయ్యారు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి-సురేఖల పెళ్లి జరిగింది.

అయితే కెరీర్ ప్రారంభంలో ఉన్న చిరంజీవికి అప్పటికే అగ్ర హాస్యనటుడిగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న అల్లు రామలింగయ్య కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని? ప్రశ్నించిన వారు లేకపోలేదు. కానీ ఆ సమయంలో అల్లు రామలింగయ్య అవేమి పట్టించుకోలేదు.చిరంజీవి కష్టపడే స్వభావం..ఎప్పటికైనా బిగ్ స్టార్ అవుతారనే నమ్మకంతో సురేఖని ఇచ్చి పెళ్లి చేసారు. చిరంజీవి కష్టం గురించి అల్లు రామలింగయ్య చాలా సందర్భాల్లో చెప్పారు. అలా చిరంజీవి సక్సెస్ ని అల్లు రామలింగయ్య చిరు కష్టంలోనే చూసేసారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి పెళ్లి నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు.

“పెళ్లి సమయానికి `తాతయ్య ప్రేమ లీలలు` అనే సినిమా చేస్తున్నా. అందులో నూతన్ ప్రసాద్ తో నాకు కొన్ని సీన్లు ఉన్నాయి. అప్పట్లో నూతన్ ప్రసాద్ బిజీ ఆర్టిస్ట్ కావడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుదని అనుమానం వచ్చింది కానీ నిర్మాత షూటింగ్ నే వాయిదా వేసి మా పెళ్లికి గ్యాప్ ఇచ్చారు.ఇక పెళ్లి పీఠల మీద కూర్చునే సరికి నా చొక్కా చిరిగిపోయి ఉంది. అది చూసిన సురేఖ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చింది. అప్పుడు బట్టలు చినిగితే తాళి కట్టలేనా? అని చెప్పి అలాగే కట్టేసాను అని చిరంజీవి నవ్వేసారు.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవి కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `ఖైదీ నంబర్ 150`వ సినిమాతో కంబ్యాక్ అయ్యారు. కోలీవుడ్ చిత్రం `కత్తి` రీమేక్ గా తెరకెక్కిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అటుపై విప్ల వీరుడు `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ` బయోపిక్ లో నటించారు. `సైరా నరసింహారెడ్డి` టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా తో చిరంజీవి చిరకాల కోరిక నెరవేరింది.

ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సహా అన్ని పనులు పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే మలయాళం సినిమా `లూసీ ఫర్` రీమేక్ లో నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని `గాడ్ ఫాదర్` టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్ట్ లకు చిరంజీవి కమిట్ య్యారు.