క్రేజీ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా మయోసైటీస్ తో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఆ కారణంగా సినిమా ప్రమోషన్స్ కి దూరంగా వుంటూ వస్తున్న సమంత ఇటీవల ‘శాకుంతలం’ ప్రెస్ మీట్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురి కావడం ఆమె ఫ్యాన్స్ తో పాటు ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ఇదిలా వుంటే మయోసైటీస్ నుంచి సమంత ఫాస్ట్ గా రికవరీ అవుతోంది.
తాజాగా తను బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకె రూపొందిస్తున్న ‘సీటాడెల్’లో నటిస్తోంది. అవెంజర్స్ సిరీస్ చిత్రాల దర్శకులు రుస్సో బ్రదర్స్ రూపొందించిన నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ గా ‘సీటాడెల్’ రూపొందుతోంది. ఇందులో సమంత కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ నేపథ్యంలో సామ్ సోషల్ మీడియా వేదికగా తన స్నేహితురాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ చిన్మయిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ ఇద్దరు స్నేహితుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారి ఆకట్టుకుంటోంది. మయోసైటీస్ నుంచి కోలుకుంటున్న సమంత ఇటీవలే ‘సీటాడెల్’ షూటింగ్ లో పాల్గొనడం మొదలు పెట్టింది. హాలీవుడ్ దర్శకద్వయం రుస్సోబ్రదర్స్ ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సమంత తాము నిర్మిస్తున్న సిరీస్ లోకి ఎంటరవుతున్న నేపథ్యంలో హాలీవుడ్ దర్శకద్వయం రుస్సో బ్రదర్స్ స్వాగతం పలికారు.
దీనిపై హీరో దర్శకుడు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ‘సామ్ ప్రయాణం ఎలా మొదలైందో నాకింకా గుర్తుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు రుస్సో బ్రదర్స్ సామ్ ను తమ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానించడం చూస్తుంటే ఎంతో గర్వంగా వుంది అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై చిన్మయి స్పందిస్తూ ‘సమంత ఓ క్వీన్..ఇదే నిదర్శనం’ అని ట్వీట్ చేసింది. చిన్మయి ట్వీట్ పై సమంత కామెంట్ చేసింది. ‘నేను కాదు నువ్వే చిన్మయి..అలాగే రాహుల్ లాంటి స్నేహితుడు నాకు లభించడం నిజంగా నా అదృష్టం’ అని పేర్కొంది.
చాలా కాలం తరువాత తన స్నేహితురాలు చిన్మయి గురించి సోషల్ మీడియా వేదికగా సమంత స్పందించడంతో ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. సామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ‘ఏమాయ చేసావె’ మూవీ నుంచి చిన్మయి తనకు డబ్బింగ్ చెబుతూ వస్తోంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఏర్పడింది. అయితే ‘యూటర్న్’ మూవీ నుంచి సామ్ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపించాయి. తాజా సంభాషణతో అవిన్నా అబద్ధం అని తేలింది.