సీనియర్ నటులు డా. ఎం. ప్రభాకర్ రెడ్డి ఇండస్ట్రీలో వున్న సినీ కార్మికుల కోసం స్థిర నివాసం వుండాలనే సంకల్పింతో చిత్రపురి కాలనీకి శ్రీకారం చుడుతూ తన వంత సహాయంగా కొంత భూమిని కార్మికుల నివాసాల కోసం దానం చేశారు. ఇదిలా వుంటే చిత్రపురి కాలనీలో కార్మికుల కోసం హాస్పిటల్ ని నిర్మించాలని ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో చిత్రపురి కమిటీ వారు చిరంజీవిగారు కార్మికుల కోసం హాస్పిటల్ ని నిర్మించాలనుకుంటున్నారని చెప్పడం సరికొత్త చర్చకు తెర లేపింది.
అంతే కాకుండా రీసెంట్ గా డిసెంబర్ 29న ఎంఐజీ హెచ్ ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశాల మహాత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎం. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆహ్వానం లేదు. ఈ విషయాలపై తాజాగా ఓ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రభాకర్ రెడ్డి కుమార్తె శైలజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే తమ ఫ్యామిలీకి ఎలాంటి ఆహ్వానం లేకపోవడం మా మదర్ కు మనస్థాపాన్ని కలిగించిందన్నారు.
ఈ విషయంలో అమ్మ ఫీలయ్యారని తెలిపారై శైలజ. ఇన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా మా ఫ్యామిలీకి ఆహ్వానాలు లేవని అయితే తాజాగా జరిగిన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించకపోవడంతో అమ్మ ఫీలయ్యారని తెలిపారు.
ఆహ్వానం లేకపోయినా కనీసం కమిటీ సభ్యుల నుంచి ఫోన్ అయినా వస్తుందని అమ్మ భావించారు. ఆ తరువాత హోర్డింగ్ లు చూసి చాలా మంది మీరు వెళ్లండం లేదా? అని అడిగినప్పుడు అమ్మ అదేంటీ మనకు ఆహ్వానం లేకపోవడం ఏంటన్నారు.
ఈ విషయం కనుక్కోవాలని రమిటీ పెద్దలకు మా సిస్టర్ ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. నాన్న పేరుమీద ఏదైనా చేస్తే మమ్మల్ని కానీ లేదా అమ్మని కానీ పిలిస్తే బాగుంటుందని భావించాం. ఇంత జరుగుతున్నా అమ్మకు కనీపం ఇన్విటేషన్ లేకపోవడం బాధగా అనిపించింది. చాలా మంది అదేంటీ ఫౌండర్స్ మీరు లేకుండా ఏంటీ? అని అడుగుతున్నారు. కార్మికులకు సొంత ఇల్లు వుండాలని నాన్న ఎంత గా శ్రమించారో మాకు తెలుసు. నాన్న పేరుతో జరుగుతున్న కార్యక్రమానికి అమ్మని ఆహ్వానించకపోవడమే మమ్మల్ని బాధిస్తోందని తెలిపారు శైలజ.
ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల కోసం ప్రత్యేకంగా కాలనీ అంటూ ఎక్కడా లేదు. ఇండస్ట్రీలో వున్న చాలా మంది పెద్దలకు నాన్న చేసిన కృషి గురించి తెలుసు. అయినా ఇప్పటికీ ఎవరూ దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు ఎందుకన్నది అర్థం కావడం లేదని తెలిపారు. మేము కాలనీలో కార్మికుల కోసం హాస్పిటల్ నిర్మిస్తామంటే చిరంజీవిగారి పేరు చెప్పి మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారని వాపోయారామె. చిరంజీవి అంటే ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ తో కమిటీ వాళ్ల పేరు పెరుగుతుందని ఇలా చేస్తున్నట్టుగా అనిపిస్తోందన్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి కుమార్తె శైలజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.