షారుఖ్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ఎంట్రీ తోనే బాక్స్ లు బద్దలు కొట్టే హిట్ అందుకుంది నయన్. ఆమె ఖాతాలో హిట్ పడినా సరే సినిమా విషయంలో నయనతార అప్సెట్ గా ఉందని కోలీవుడ్ టాక్. అలా ఎందుకు అంటే నయనతార జవాన్ సినిమాలో నర్మదా రాయ్ పాత్రలో నటించింది. సినిమాలో నయనతార తో పాటుగా దీపికా పదుకొనే కూడా నటించింది. దీపికాది కెమియో రోల్ నయనతార అసలు హీరోయిన్ కాగా సినిమా చూసిన ఆడియన్స్ నయనతార గెస్ట్ రోల్ చేస్తే దీపికాదే మెయిన్ లీడ్ గా ఉందని అంటున్నారు.
జవాన్ డైరెక్టర్ నయనతార పాత్రను కట్ చేయడంతో నయన్ రోల్ సినిమాలో చాలా చిన్నది అయ్యింది. అయితే ఈ విషయంపై ఆమెకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నయనతార చాలా ఫీల్ అయ్యిందట. అందుకే జవాన్ ప్రమోషన్స్ లో ఎక్కడ నయన్ కనిపించలేదు. ఆఖరికి తమిళ ప్రమోషన్స్ లో కూడా నయనతార పాల్గొనలేదు. అయితే ఒక పక్క నయన్ అట్లీల మధ్య ఇలాంటి వార్తలు వస్తుండగా మరోపక్క నయనతార జవాన్ విషయంలో అప్సెట్ అయిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని షారుఖ్ తో స్క్రీన్ సేర్ చేసుకున్నందుకు ఆమె హ్యాపీగా ఉన్నారని అంటున్నారు.
అంతేకాదు ఇటీవలే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చారు. చేతినిండా సినిమాలు సంతోషకరమైన ఫ్యామిలీ కెరీర్ లో ఇంకా చాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉత్సాహంగా ఉంది నయనతార. జవాన్ తర్వాత బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వస్తున్నా నయన్ మాత్రం ప్రస్తుతం కమిటైన తమిళ సినిమాలు పూర్తి చేశాకనే మిగతా సినిమాలు చేయాలని అనుకుంటుందట.
ఇన్నాళ్లు బాలీవుడ్ ఆడియన్స్ నయన్ నటన మిస్ అయ్యారు. అయితే జవాన్ తో అది కూడా జరిగింది. ఇక మీదట నయన్ తన మార్కెట్ పెంచుకునే క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా వాటిని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నయన్ ఇక మీదట మరిన్ని ప్రయోగాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. జవాన్ చూసిన నయన్ ఫ్యాన్స్ ఆమెను ఇంకా మరెన్నో బాలీవుడ్ సినిమాల్లో చూడాలని కోరుతున్నారు. ఎలాగు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి కచ్చితంగా నయనతార అక్కడ కూడా అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.