జాన్వి బాత్ రూమ్.. బోనీ బయట పెట్టిన సీక్రెట్..!

బాలీవుడ్ సూపర్ డాడ్ అండ్ క్యూట్ డాటర్ గా బోనీ కపూర్ జాన్వి కపూర్ ల గురించి చెప్పుకోవచ్చు. నిర్మాతగా ఆయన హీరోయిన్ గా ఈమె వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్లు అవుతున్నా ఇప్పటివరకు తండ్రి నిర్మాణంలో సినిమా చేయలేదు. ఫస్ట్ టైం మిలి సినిమా చేసింది. మళయాళ సూపర్ హిట్ మూవీ హెలెన్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన మిలి సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండ్రి కూతుళ్లు ఇద్దరు కలిసి పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు.

లేటెస్ట్ గా బాలీవుడ్ క్రేజీ టాక్ షో కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొన్నారు బోనీ కపూర్ జాన్వి. ఇలాంటి ఇంటర్వ్యూలో స్టార్స్ గురించి ఎవరికి తెలియని విషయాన్ని రాబట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో జాన్వి గురించి కూపీలాగే ప్రయత్నంలో తన బెడ్ రూమ్ ఎలా ఉంటుంది.. బాత్ రూమ్ ఎలా ఉంటుంది అని బోనీ కపూర్ ని అడిగాడు కపిల్ శర్మ.

దానితో బోనీ కపూర్ జాన్వి బాత్ రూమ్ లో ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయని.. పేస్ట్ క్యాప్ తీసి ఉంటుందని చెప్పడం మొదలు పెట్టాడు. దానితో చిరాకు పడ్డ జాన్వి కపూర్ డాడీ నా పరువు తీయకు అంటూ బోనీ పై అరిచేసింది. ఎక్కడ తన సీక్రెట్స్ అన్ని బయట పెడడతాడో అని జాన్వి కపూర్ బోనీని కంట్రోల్ చేసె ప్రయత్నం చేసింది.

తన డాటర్ సినీ కెరియర్ పై చాలా సంతృప్ప్తిగా ఉన్నారు బోనీ కపూర్. తనకు నచ్చిన కథలను చేసుకుంటూ వెళ్తుంది. కెరియర్ లో తనకు నా హెల్ప్ లేకుండానే తన టాలెంట్ తోనే అవకాశాలు తెచ్చుకుంటుందని అన్నారు బోనీ కపూర్. మిలి సినిమాతో ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది.

ఈ సినిమా మాకెంతో స్పెషల్ అంటున్నారు బోనీ కపూర్. జాన్వి కూడా మిలి సినిమాపై మనసు పారేసుకుంది. ఎన్ని సినిమాలు చేసినా తండ్రి బ్యానర్ లో చేసిన మొదటి సినిమాగా ఇది కెరియర్ మొత్తం గుర్తుంటుంది అని అంటుంది.

మిలి ప్రమోషన్స్ కోసాం హైదరాబాద్ కూడా వచ్చారు జాన్వి కపూర్. ఆ టైం లో ఆమె టాలీవుడ్ ఎంట్రీపై మీడియా ప్రశ్నించగా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అన్నది. ఎన్.టి.ఆర్ లాంటి లెజెండ్ యాక్టర్ తో నటించాలని ఉత్సాహంగా ఉంది జాన్వి. మిలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే రిలీజ్ చేస్తున్నారు. జాన్వి ఈ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు.