టాలీవుడ్ వైపు చూస్తున్న ధోనీ.. కారణం ఇదే!

టాలీవుడ్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. క్రికెట్ లో ఉన్న సమయంలోనే ఎన్నో రంగాల్లో అడుగు పెట్టిన ధోనీ మెల్లగా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ టైమ్ ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళంలో తన నిర్మాణంలో మొదటి సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఎల్.జీ.ఎమ్ అనే టైటిల్ తో రూపొందిన ధోనీ నిర్మాణంలోని సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెన్నై లో సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ధోని పాల్గొన్నాడు. తమిళ సినీ ఇండస్ట్రీలో ధోనీ మొదటి సినిమా నిర్మించడానికి కారణం ఏంటి అనేది తెలియదు. కానీ తెలుగు లో కూడా ఒక సినిమాను నిర్మించేందుకు ధోనీ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ధోనీ నిర్మాణంలో తదుపరి సినిమా కూడా తమిళం లోనే ఉండబోతుందట. అదే సమయంలో ఒక తెలుగు సినిమా ను కూడా నిర్మించేందుకు గాను చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాను నిర్మించేందుకు యంగ్ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ధోనీ నిర్మాణంలో సినిమా అంటే ఏ హీరో అయినా వెంటనే డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక త్వరలోనే ధోనీ నిర్మాణంలో తెలుగు యంగ్ హీరో సినిమా ఏ సమయంలో అయినా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళ్.. తెలుగు లో మాత్రమే కాకుండా హిందీలో కూడా ధోనీ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.