బాలీవుడ్ ఓటీటీ బిగ్ బాస్ కంటెంస్టెంట్లు జద్ హదీద్-ఆకాంక్ష పూరిల ప్రెంచ్ లిప్ లాక్ సీన్ నెట్టింట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఎదురుగా కంటెస్టెంట్లు..అంతకుమించి కోట్లాది మంది వీక్షిస్తున్న సమయం లో ఇద్దరు లిప్ కిస్సులో చెలరేగిన వైనం అందర్నీవిస్మయానికి గురి చేసింది. ఈ ఘటన పై సల్మాన్ ఖాన్ సీరియస్ అవ్వడం..ఇద్దరికీ క్లాస్ పీకడం తెలిసిందే. అదే సమయం లో ఆకాంక్ష పై ఎలిమినేషన్ రూపం లో వేటు పడింది. తాజాగా ఎలిమినేషన్ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘ఈ విధంగా షో నుంచి బయట కు వచ్చినందుకు బాధగా ఉంది. టాస్క్ లో భాగంగానే హదీద్ ముద్దు పంచుకున్నాను. ఇదంతా టాస్క్ లో భాగంగానే. టాస్క్ కింద నాకు 30 సెకన్ల సమయం ఇచ్చారు.దీన్ని టాస్క్ గానే భావించాను. వ్యక్తిగత ఆసక్తితో ముద్దులు పెట్టుకోలేదు. లిప్ లాక్ చేయాలనే ఆసక్తి నాకెంతో మాత్రం లేదు. ప్రచారం కోసమో..మరో ఉద్దేశమో నాకు లేదు. జైద్ స్థానం లో మరొకరు ఉన్నా అలాగే ముద్దు పెట్టేదాన్ని.
ఇది ఇంత సమస్యగా మారుతుందని అప్పుడు ఊహించలేకపోయా ను. అలా ముందే నాకు తట్టి ఉంటే అలాంటి పని చేసేదాన్ని కాదు. వ్యక్తిగతంగా కొంత మంది మనోభావాలు దెబ్బ తీసి ఉంటే క్షమించగలరు’ అని తెలిపింది. మొత్తానికి ఆకాంక్ష ముద్దు వివాదం ఇప్పటి తో ముగిసింది. సల్మాన్ ఖాన్ ముద్దు గురించిన అడిగిన సమయం లో ఆకాంక్ష సమర్దించుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
ఇద్దరిది తప్పు కాదన్నట్లు చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆ మాటలు వినలేదు. పబ్లిక్ గా అంత మంది ముద్దు పెట్టుకోవడం తప్పని హెచ్చరించారు. ఇక జద్ హదీద్ కి సల్మాన్ గట్టి గానే క్లాస్ పీకారు. పెళ్లై పిల్లులు ఉన్నా నీకు అలాంటి పనులేంటని మందలించారు.