ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి నటించిన చిత్రం క్రేజీ అంకుల్స్. ఇ.సతీబాబు దర్శకత్వం వహిస్తున్నారు. గాయకుడు మనో.. రాజా రవీంద్ర .. భరణి క్రేజీ అంకుల్స్ గా కనిపించనున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన క్రేజీ అంకుల్స్ సాంగ్ రొమాంటిక్ టోన్ తో అలరించింది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.
టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ ఆద్యంతం ఫన్ ఎలిమెంట్స్ తో కడుపుబ్బా నవ్విస్తోంది. పక్క అపార్ట్ మెంట్ లో దిగిన గ్లామరస్ దేవత శ్రీముఖి కి లైనేసేందుకు ఆరాటపడే క్రేజీ అంకుల్స్ కథ ఇది. రాజు-రెడ్డి-రావు అంకుల్స్ శ్రీముఖిని ఎలా వెంటాడారు? అన్నదే సినిమా కథాంశం.
శ్రీముఖిని గ్లామరస్ క్వీన్ గా ఈ సినిమాలో ఎలివేట్ చేస్తున్నారు. టైటిల్ ట్రాక్ తో ట్రైలర్ అద్భుత ఇంట్రో ఆకట్టుకోగా..బండ్ల గణేష్ కి కథ వినిపించే ఔత్సాహిక దర్శకుడిగా ప్రవీణ్ కనిపించారు. బండ్ల నిజంగానే విలక్షణ నిర్మాతగా ఫన్ జనరేట్ చేస్తున్నారు. శ్రీముఖితో క్రేజీ అంకుల్స్ సీక్రెట్ రొమాంటిక్ ఎఫైర్ కథను ప్రవీణ్ బండ్లకి ఆవిష్కరించాడు. శ్రీముఖి ఉన్న అపార్ట్ మెంట్ లో ఏం జరుగుతోంది అనేది పెప్పీ ఎలిమెంట్. ట్రైలర్ ఆద్యంతం ఫన్ మూవ్ మెంట్ జనాల్ని థియేటర్లకు లాక్కెళ్లేట్టే కనిపిస్తోంది. గుడ్ ఫ్రెండ్స్.. శ్రీవాస్ 2 క్రియేటివ్స్.. బొడ్డు అశోక్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19 న విడుదల కానుంది.