డబుల్ ఇస్మార్ట్… మాస్ కిక్కు గట్టిగానే..

రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీతో ఆగష్టు 15న పాన్ ఇండియా లెవల్ లో థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. పూరి జగన్నాథ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో చాలా టైం తీసుకొని పెర్ఫెక్ట్ గా డబుల్ ఇస్మార్ట్ రెడీ చేశారు. ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ యిపోయాయి. వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకి సంబందించి డబుల్ ఇస్మార్ట్ థీయాట్రికల్ రైట్స్ ని 60 కోట్లకి ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి సొంతం చేసుకున్నారు.

ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ నుంచి ఒక సాంగ్ ప్రేక్షకుల ముందుకొచ్చి బాగా కనెక్ట్ అయ్యింది.

ఇప్పుడు సినిమాని మరింతగా జనాల్లోకి పంపించడం కోసం మాస్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. మార్ ముంతా చోర్ చింతా అంటూ సాగే గీతాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉంటే కాసర్ల శ్యామ్ ఈ సాంగ్ కి లిరిక్స్ సమకూర్చారు. కాసర్ల శ్యామ్ ఈ సాంగ్ నుంచి రామ్ స్టిల్ ని షేర్ చేసి నువ్వు గంత గింత కాదు అసలే డబలిస్మార్టు నీ జోరు చూస్తె గూడ్స్ రైలు గుద్దుకున్నట్టు .. బోరానుంటది పాట… అంటూ ట్వీట్ చేశారు.

దీనిపై పూరి కనెక్ట్స్ నువ్ పూల పూల అంగీ ఏసి ఇస్టైల్ కొట్టు ఓల్డ్ సిటీ ఊగిపోదా… Old Monk తాగినట్టు.. అంటూ సాంగ్ లిరిక్స్ ని ట్వీట్ గా షేర్ చేశారు. పక్కా పాతబస్తీ తెలంగాణ యాసలో ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ స్లాంగ్ ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే ఈ మాస్ సాంగ్ ని కూడా పక్కా హైదరాబాదీ తెలంగాణ స్లాంగ్ పడికట్టు పదాలతో కాసర్ల శ్యామ్ రాశారు. ఈ సాంగ్ లో రామ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ బీభత్సంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. అతని లుక్ కూడా కేక పుట్టించడం ఖాయం అనే కామెంట్స్ వస్తున్నాయి.

కావ్య థాపర్ ఈ మాస్ సాంగ్ లో రామ్ తో కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులు వేయనుంది. మణిశర్మ సంగీతం కాసర్ల శ్యామ్ లిరిక్స్, రామ్ డాన్స్ తో మార్ ముంతా చోర్ చింతా సాంగ్ సూపర్ హిట్ ఖాయం అని ఉస్తాద్ రామ్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.