డబుల్ పుకార్లపై మంచు మనోజ్ క్లారిటీ

హీరో మంచు మనోజ్ సినిమాలతో కంటే ఈ మధ్య కాలంలో వ్యక్తిగత విషయాలు మరియు కుటుంబ విషయాల వల్ల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. ఆ విషయాల గురించే నెట్టింట పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. మొన్నటి వరకు కుటుంబంలో విభేదాలు అంటూ తెగ వార్తలు వచ్చాయి. PlayUnmute /

ఇటీవల మంచు మనోజ్‌ భార్య ట్విన్స్ కు జన్మనిచ్చిందని, హీరో గారికి డబుల్‌ ధమాకా అన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నారు. నెట్టింట కొన్ని మార్ఫింగ్ ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు మంచు మనోజ్‌ ఎందుకు అధికారికంగా తన అధికారిక ఖాతా నుంచి చెప్పడం లేదు అన్నట్లుగా అంతా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయమై స్పందించాడు. తన భార్య మౌనిక ట్విన్స్ కు జన్మనిచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా నా నుంచి అధికారికంగా ప్రకటన ఉంటుంది. అప్పటి వరకు ఎలాంటి పుకార్లు నమ్మవద్దు అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం మౌనిక రెడ్డి ఏడవ నెల గర్భవతిగా ఉన్నట్లుగా కూడా మనోజ్‌ చెప్పుకొచ్చాడు. మే లో తన డెలివరీ ఉండే అవకాశం ఉందని, అప్పుడు మా ఫ్యామిలీ పెరగనున్నట్లుగా మనోజ్ ప్రెస్ నోట్‌ లో పేర్కొన్నాడు. మొత్తానికి ట్విన్స్, డబుల్‌ ధమాకా అంటూ నెట్టింట జరిగిన ప్రచారంకు మనోజ్ చెక్ పెట్టాడు. ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే ఆ మధ్య ఒక భారీ పాన్ ఇండియా సినిమాను మొదలు పెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఉస్తాద్‌ అనే టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో మనోజ్ కొత్త సినిమా ప్రకటన ఉంటుందేమో చూడాలి.