తండ్రి-తనయుల మధ్య క్రిష్-4 చిచ్చు!

‘క్రిష్-4’ తండ్రి-తనయుల మధ్య చిచ్చు పెడుతోందా? మేకర్ ఎంపిక విషయంలో హృతిక్ రోషన్-రాకేష్ రోషన్ మధ్య బేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయా? ఒకరు బాలీవుడ్ అంటే? మరొకరు హాలీవుడ్ వెంట పడుతున్నారా? అంటే అవుననే ప్రచారం తెరపైకి వస్తోంది. ‘క్రిష్ -4’ విషయలో ఐదారేళ్లగా ప్రచారం సాగుతోన్నా? ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తోన్న సంగతి తెలిసిందే.

హృతిక్ సినిమాలు వరుసగా పరాజయం చెందడం.. ‘రామాయణ్’ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే బయటకు రావడం వంటి కారణాలతో దూరమవ్వడంతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కంటెంట్ తోనే రావాలని హృతిక్ స్ర్టాంగ్ ఉన్నారు. దీనిలో భాగంగా కొద్ది కొన్ని నెలలుగా కలల ప్రాజెక్ట్ ‘క్రిష్ -4’పైనే తండ్రి-తనయులు కసరత్తులు చేస్తున్నారు. స్ర్కిప్ట్ పనుల్లో భాగంగా రాకేష్ తో పాటు హృతిక్ కూడా పాల్గొంటున్నారు.

సైమల్టేనియస్ గా హృతిక్ దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. తన టీమ్ ఐదారుగురు హాలీవుడ్ దర్శకుల కోసం ఓ జాబితా సిద్దం చేయగా రాకేష్ రోషన్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక్కడి దర్శకుల్ని కాదని హాలీవుడ్ కి వెళ్లడం సరికాదని…బాలీవుడ్ దర్శకులతోనే క్రిష్-4 తెరకెక్కిద్దామన్న తన నిర్ణయాన్ని వెల్లడించారుట. అందుకు హృతిక్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సూపర్ హీరో చిత్రాన్ని ఇంకా అడ్వాన్స్ గా తెరకెక్కించాలంటే బాలీవుడ్ కంటే హాలీవుడ్ మేకర్స్ అయితేనే ది బెస్ట్ అందిస్తారని తండ్రి వద్ద ప్రస్తా వించారుట. అయితే అందుకు రాకేష్ రోషన్ ససేమీరా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారుట. ఈ నేపథ్యంలో విషయంపై ఇద్దరి మధ్య సీరియస్ గా డిస్కషన్స్ జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. మరి అంతిమంగా ఎవరి మాట నెగ్గుతుందన్నది చూడాలి.

‘క్రిష్’ సీరిస్ కి దర్శకుడుగా వ్యవహరించింది రాకేష్ రోషన్ అన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలకు ఆయనే దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన తప్పుకోవడం సహా బాలీవుడ్ ..హాలీవుడ్ దర్శకులు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

రాకేష్ రోషన్ ఏ కారణంతో ఎగ్జిట్ అవుతున్నారు? అన్నది అభిమానులకు అంతు చిక్కని సందేహంగానూ మారింది. ఏది ఏమైనా క్రిష్ డైరెక్టర్ ఛేంజ్ అన్నది అభిమానుల్ని మాత్రం కలవర పెడుతుందన్నది వాస్తవం.