తల్లిదండ్రులకు అద్భుతమైన బహుమానం ఇచ్చిన స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా వాతి/సర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల రూపాయలను రాబట్టింది. భారీ అంచనాల నడుమ రూపొందిన వాతి సినిమా తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.

వాతి సినిమా మాత్రమే కాకుండా గతంలో వచ్చిన సినిమాలతో కూడా ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్నాడు. తమిళనాట అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలో నిలిచిన ధనుష్ తాజాగా తన తల్లిదండ్రులకు అత్యంత అద్భుతమైన రాజ భవనం వంటి ఇంటిని బహుమానంగా ఇచ్చాడు.

మాజీ ముఖ్యమంతి దివంగత జయలలిత నివాసం ఉన్న పోయేస్ గార్డెన్ ప్రాంతంలోనే ధనుష్ తల్లిదండ్రుల కోసం కొత్త ఇల్లును కొనుగోలు చేశాడని.. తల్లిదండ్రుల అవసరాల నిమిత్తం ఆ ఇంటిని తీర్చి దిద్దు తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

ధనుష్ తల్లిదండ్రులు కస్తూరి రాజా మరియు విజయలక్ష్మి కి ఇంటిని బహుమానంగా ఇచ్చిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం శివ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మీడియాకు తెలియజేయడం జరిగింది.

సుబ్రమణ్యం శివ సోషల్ మీడియాలో… నా తమ్ముడు ధనుష్ కొత్త ఇల్లు ను చూస్తూ ఉంటే ఒక గుడిని చూసిన అనుభూతి కలుగుతోంది. ఆయన తన తల్లిదండ్రులకు స్వర్గం వంటి ఇంటిని అందించాడు. తల్లిదండ్రులను గౌరవిస్తూ యువ తరానికి స్ఫూర్తిగా ధనుష్ నిలుస్తున్నాడని పేర్కొన్నాడు.

ఇక ధనుష్ వ్యక్తిగత విషయానికి వస్తే రజినీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ నుండి విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ రజినీకాంత్ మధ్యవర్తిత్వంతో రాజీ కుదిరిందనే వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.