యువ సామ్రాట్ నాగచైతన్యకి టాలీవుడ్ టెబ్యూ `జోష్` నిరాశని మిగిల్చినా..డెబ్యూ వెబ్ సిరీస్ `దూత` మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. తనలో కొత్త నటుడ్ని ఆవిష్కరించిన సిరీస్ గా దూత నిలించింది. ఇటీవలే రిలీజ్ అయిన దూత మంచి విజయం సాధించిన సంగతి తెలిసింద. విక్రమ్. కె.కుమార్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా నాగచైతన్య నటనకి మంచి మార్కులు పడ్డాయి.
తనయుడుని అలాంటి పాత్రలో చూసి నాగార్జున సైతం సర్ ప్రైజ్ అయ్యారు. నిజంగా చై అలా నటించా డు? అంటే నమ్మలేకపోతున్నాని ఆయనే స్వయంగా అన్నారు. చైతన్యంలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడని ఇప్పుడే తెలిసిందంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆరకంగా చైతన్య కెరీర్ కి తొలి వెబ్ సిరీస్ దూత అంత గొప్ప పేరు తీసుకొచ్చింది. ఇక ఈసిరీస్ నుంచి రెండు…మూడు భాగాలు కూడా కొనసాగింపుగా ఉంటాయి. వాటిని తప్పకుండా చైతన్యతోనే విక్రమ్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
చైతన్య జీవితం ఇలా ఉంటుందని అతను ఏమాత్రం ఊహించలేదని తాజాగా ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. .నాగచైతన్య బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలనుకున్నాడుట. చిన్నప్పటి నుంచి తన గోల్ గా అదే ఉండేదిట. పెద్దాయ్యాక ఏమవుతావని చిన్నప్పుడు ఎవరు అడిగినా ఇంజనీర్ అవుతానని చెప్పే వారుట. కానీ ఈ విషయంలో తాను ఘోరంగా ఫెయిలై తాత మాటనే నెగ్గిందంటున్నాడు. తాతయ్య ఏఎన్నర్ మాత్రం చైతన్య నటుడవుతాడని ఎవరు అడిగినా చెప్పేవారుట.
నాగార్జునకు కూడా ఇదే మాట చెప్పే వారుట పెద్దాయన. ఇప్పుడు తాతయ్య మాటే నిజమైందని తాజాగా ఓ వేడుకలో చైతన్య ఈ విషయాలన్ని గుర్తు చేసుకున్నాడు. అంతేగా కొందరి జీవితంలో ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. నాగార్జున హీరో అవుతారని అప్పుడు ఏఎన్నార్ కూడా గెస్ చేయలేదు. ఏఎన్నార్ పెద్ద కుమారుడు వెంకట్ సలహా ఇవ్వడంతోనే నాగ్ హీరోగా మ్యాకప్ వేసుకున్నారు.