నందమూరి తారక రత్న మృతి నందమూరి ఫ్యామిలీనే కాదు నందమూరి అభిమానులను కూడా శోక సముద్రంలో ముంచేసింది. హీరోగా ఒకేసారి 9 సినిమాలను మొదలు పెట్టి రికార్డ్ సృష్టించిన తారకరత్న హీరోగా సక్సెస్ అవకపోయినా స్పెషల్ రోల్స్ తో సత్తా చాటుతూ వస్తున్నారు. ఈమధ్య ఓటీటీ సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన రాబోయే రోజుల్లో చాలా పెద్ద సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తారక రత్న మృతి తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి మీద రకరకాల వార్తలు వచ్చాయి.
తారకరత్న కి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వాటి వల్ల కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అన్నారు. కానీ తారక రత్న సన్నిహితుడు నిర్మాత ప్రసన్న కుమార్ మాత్రం తారక రత్నకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని అన్నారు. తారక రత్న పెళ్లి చేసుకున్న అమ్మాయి విజయసాయి రెడ్డి వైఫ్ చెల్లెలి కూతురు.. అప్పటికే ఆమె డైవర్సీ కాగా ఎన్.టి.ఆర్ ఫ్యామిలీలో అందరు లేడీస్ టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు అంతా వారే చూసుకునే వారు. ఫ్యామిలీ లేడీస్ కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ లో ఉంటారని. తాను లవ్ చేసిన స్ట్రక్చర్ లోకి వస్తే కొంచెం వెస్ట్రన్ కల్చర్ ఉంది . సో తారకరత్న ఇంటినుంచి బయటకు వెళ్తాను అని వెళ్ళాడు . మ్యారేజ్ టైం లోనే మోహనకృష్ణ తారకరత్నకు రావాల్సినదంతా ఇచ్చేశారు. అప్పటి నుంచి ఆయన తన లైఫ్ తన సినిమాలు చేస్తూ ఉన్నారని అన్నారు.
వరుసగా సినిమాలు చేస్తూ సినిమాకు 20 నుంచి 30 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారక రత్న ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని. తారక రత్న తనతో అన్ని విషయాలు షేర్ చేసుకునే వారని.. త్వరలో బాలకృష్ణతో ఒక సినిమా ఉండబోతుందని చెప్పారని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని అన్నారు ప్రసన్న కుమార్.
అంతేకాదు భారీ సినిమాల్లో కూడా ఆయనకు ఆఫర్లు వచ్చాయి.. సర్పంచ్ అనే టైటిల్ తో ఒక సినిమా కూడా చేయాల్సి ఉందని.. ఇక మీదట లైఫ్ చాలా బాగుండేదని.. పొలిటికల్ గా కూడా ఎమ్మెల్యే మినిస్టర్ స్థాయికి వెళ్లే వారని అన్నారు ప్రసన్న కుమార్. ఈమధ్య ఆయన గడ్డం పెంచి లుక్ కూడా మార్చేశారని అన్నారు. తారకరత్న మృతిని నందమూరి ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఇంకా ఆ విషాద ఛాయల్లోనే ఉన్నారు.