టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మోస్ట్ టాలెంటెడ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మంచి ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. తారక్ కు చిన్నప్పటి నుంచే వీరాభిమాని అయిన విశ్వక్ సేన్.. తెలుగు ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంటూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల గామితో వచ్చి హిట్ కొట్టారు.
అయితే కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10వ తేదీన విడుదల అవ్వనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. తాజాగా ఈ మూవీపై విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తారక్ తో దిగిన పిక్ కూడా షేర్ చేశారు. ఇద్దరూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు
“ఫర్ ఎవర్ లవ్ యూ ఎన్టీఆర్ అన్నా. దేవర మూవీ మ్యూజిక్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా ఆల్బమ్ అందరినీ పాటలతో చంపేస్తుంది. ఎన్టీఆర్, అనిరుధ్ ఆన్ ఫుల్ ఫైర్” అంటూ విశ్వక్ సేన్ పోస్ట్ పెట్టారు. ఇక విశ్వక్ పోస్ట్ చూసిన తారక్ ఫ్యాన్స్.. ఖుషీ అవుతున్నారు. దేవర మూవీకి అనిరుధ్ కేక పుట్టించే మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. అనిరుధ్ కూడా ఈ మూవీ బీజీఎం వేరే లెవెల్ లో ఉంటుందని ఇది వరకే చెప్పారు.
ఇక విశ్వక్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా క్రేజీ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ తో తీసుకున్న పిక్ పోస్ట్ చేసి బిగ్ సర్ ప్రైజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. విశ్వక్ సేన్ కూడా టిల్లు స్క్వేర్ రూ.100 కోట్ల దిశగా దూసుకెళ్లడంతో ఆ మూవీ టీమ్ కు విష్ చేశారు. నిర్మాత నాగ వంశీ, సిద్ధు, ఎన్టీఆర్ తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. వాట్ ఏ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నాగ వంశీ డీసెంట్ లుక్ లో ఉండగా.. ముగ్గురు హీరోలు తమ లుక్స్ తో మాత్రం అదరగొట్టారు.
అయితే విశ్వక్ సేన్, సిద్ధు, నాగ వంశీ ముగ్గురూ కలిసి ఎన్టీఆర్ ను మంగళవారం రాత్రి కలిసినట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురికి తారక్ స్పెషల్ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ఆ ఫోటోలనే సిద్ధు, విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో షేర్ చేశారట. ప్రస్తుతం ఈ పిక్స్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ముగ్గురు హీరోలతో నాగ వంశీ ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తే అద్బుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఫ్యూచర్ లో అది జరుగుతుందో లేదో చూడాలి మరి. ఇక సితార ఎంటర్టైన్మెంట్ లో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.