వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న అనిల్ రావిపూడి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఊహించుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని కూడా కమర్షియల్ కామెడీ యాక్షన్ చిత్రాలుగానే తెరకెక్కాయి.
ఈ నేపధ్యంలో బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ కోరుకునే క్యారెక్టరైజేషన్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడు అనే ప్రశ్నలు నందమూరి అభిమానులలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ తెరపైకి వచ్చింది. నిజానికి వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లోనే అనిల్ రావిపూడి తన సినిమా కథ బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది చెప్పేశాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సారి బాలయ్య భీభత్సం చూస్తారని చెప్పాడు. తాజాగా దీనిపై మరోసారి స్పష్టత వచ్చింది.
బాలయ్య క్యారెక్టర్ తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటుందని సమాచారం. బాలయ్యనుంచి ఫ్యాన్స్ కోరుకునే పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో 60 ఏళ్ళ వ్యక్తిగా బాలకృష్ణ కనిపిస్తాడని సమాచారం. దాంతో పాటు సినిమా కథాంశం బట్టి మూడు వేరియేషన్స్ లో బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటుందని టాక్. యువకుడిగా ఒక పాత్ర ఉండగా తరువాత మధ్య వయస్కుడి పాత్ర కనిపిస్తుందని దానికి కొనసాగింపుగా 60 ఏళ్ళ వ్యక్తి పాత్ర ఉంటుందని సమాచారం. ఓ విధంగా చెప్పాలంటే కథ మొత్తం ఒక పవర్ ఫుల్ లీడర్ లైఫ్ జర్నీగా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపిస్తుందని తెలుస్తుంది. ఆమె పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ కామెడీ మిస్ కాకుండానే బాలకృష్ణని యాక్షన్ సీక్వెన్స్ తో పవర్ ఫుల్ గా సినిమాలో ఎలివేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య పవర్ అనిల్ ఫన్ కలిపిన చిత్రంగా ఈ మూవీ ఉండబోతుంది అని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.