తెలుగు డైరెక్టర్స్.. విజయ్ ఫ్యాన్స్ టెన్షన్

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. లియో టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా లోకేష్ యూనివర్స్ లో భాగంగానే రెడీ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఇళయ దళపతి విజయ్ తెలుగులో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు మూవీని విజయ్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ని ఆశించిన స్థాయిలో మెప్పించలేదని చెప్పాలి.

విజయ్ నుంచి ఫ్యాన్స్ అవుట్ అండ్ అవుట్ మాస్ కథలని మాత్రమే కోరుకుంటున్నారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండాలని ఆశిస్తారు. ఆ తరహా కథలనే ఇప్పటి వరకు విజయ్ చేస్తున్నారు. అయితే వారిసు మూవీ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సినిమా కమర్షియల్ హిట్ అయిన కూడా ఫ్యాన్స్ కి పెద్దగా నచ్చలేదు.

తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ అయితే రాలేదు. ఇప్పుడు మరల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుందంట.

అయితే విజయ్ ఈ దర్శకుడితో ఎలాంటి కథ చేస్తాడు అనేది ఇప్పుడు ఫ్యాన్స్ నిటెన్షన్ పెట్టె అంశంగా ఉంది. టాలీవుడ్ దర్శకులు కథలు అన్ని కూడా వారి నేటివిటీకి అనుగుణంగా ఉంటాయని ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తారని దళపతి ఫ్యాన్స్ అభిప్రాయం.

గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమా కూడా ఎమోషన్స్ తోనే తెరకెక్కింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు గోపీచంద్ విజయ్ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయం ఆసక్తిగా మారింది. కంప్లీట్ మాస్ యాక్షన్ చిత్రంగా ఉంటే పర్వాలేదు కాని మళ్ళీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తేనే వారిసు తరహాలో అవుతోంది అని భావిస్తున్నారు.