తెలుగు తెర మీద మరో బాలీవుడ్ అందం..!


పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు సాధిస్తున్న విజయాలు చూసి ఒకప్పుడు టాలీవుడ్ లో నటించాలని ఛాన్స్ వచ్చినా కాదన్న వారే ఇప్పుడు ఆ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కథానాయికలు అయితే తెలుగు సినిమాలను ఒకప్పుడు చాలా తేలిగ్గా తీసిపారేసే వారు కానీ ఇప్పుడు అక్కడ తారామణులే కాదు స్టార్స్ కూడా తెలుగులో ఆఫర్ వస్తే చాలు ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుంచి స్టార్స్ టాలీవుడ్ బాట పట్టారు.

కథానాయికల్లో ఇప్పటికే అలియా భట్, దీపికా పదుకొనె, జాన్వి కపూర్, శ్రద్ధా కపూర్ తెలుగు సినిమాల్లో నటించగా దిశా పటాని ఎప్పుడో తెలుగులో తన లక్ టెస్ట్ చేసుకుంది. ఐతే లేటెస్ట్ గా మరో బాలీవుడ్ భామ తెలుగు ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అది ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. బీ టౌన్ ఆడియన్స్ ను ఎన్నో ఏళ్లుగా తన గ్లామర్ తో, నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న కరీనా కపూర్ సైఫ్ తో మ్యారేజ్ తర్వాత సినిమాలు చాలా తగ్గించారు.

తెలుగు హీరోల‌ను విదేశీయులు ఆద‌రిస్తున్నారు: దిల్ రాజు ఐతే మళ్లీ ఆమె ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు నుంచి వచ్చిన ఒక క్రేజీ ఆఫర్ కు ఆమె ఓకే చెప్పారని తెలుస్తుంది. ప్రభాస్ తో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ సినిమాలో కరీనా ని తీసుకోవాలని చర్చ జరుగుతుంది. కరీనా దాకా ఈ ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఆమె కూడా పాజిటివ్ గానే స్పందించారని చెబుతున్నారు. బాహుబలి నుంచి ప్రభాస్ ప్రతి సినిమా బాలీవుడ్ లో అదరగొట్టేస్తున్నాయి.

లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్, ఈమధ్య వచ్చిన కల్కి రెండు సినిమాలు ప్రభాస్ స్టామినా ఏంటో చూపించాయి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుంది. స్పిరిట్ లో సాధ్యమైనంతవరకు పాన్ ఇండియా యాక్టర్స్ ని ఫిక్స్ చేస్తున్నాడు సందీప్ వంగ. ఈ క్రమంలో ప్రభాస్ కోసం కరీనా ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు. అదే జరిగితే మాత్రం తెలుగు తెర మీద మరో బాలీవుడ్ అందాన్ని చూసే ఛాన్స్ ఉంటుంది.

సైఫ్ ఎలాగు దేవర తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అదే వరుసలో కరీనా కూడా స్పిరిట్ తో తెలుగు ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు సైఫ్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడు.