త్రిష ఇన్ స్టా నుంచి నిష్క్రమణం.. అసలేమైంది?


ఇటీవల నిత్యం ఇన్ స్టా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ లు షేర్ చేస్తోంది త్రిష. అయితే ఇటీవల తను షేర్ చేసిన స్టోరీస్ ని వరుసగా తొలగిస్తూ వస్తోంది. దీంతో త్రిష అభిమానల్లో డౌట్ మొదలైంది. ఆమె అకౌంట్ ని ఎవరైనా హ్యాక్ చేశారా? లేక త్రిషనే ఇన్ స్థా నుంచి నిష్క్రమించిందా? అని అనుమానించారు. అయితే తాను డిజిటల్ డిటాక్స్ కింద వున్నానని అసలు పోస్ట్ ల కంటే ఎక్కువగా కథల్ని పంచుకుంటున్నానని తెలియడంతో ఇన్ స్టాలో తాను పోస్ట్ చేసిన కథల్ని తొలగించానని త్రిష స్పష్టం చేసింది.

దీంతో అభిమానుల్లో నెలకొన్న అపోహలన్నీ తొలగిపోయాయి. `96` మూవీతో తనలో ఆ గ్రేస్ హీరోయిన్గా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. 2018లో వచ్చిన ఈ చిత్రం దాదాపు వివిధ ప్లాట్ ఫామ్లలో 11 అవార్డుల్ని అందించింది. ప్రస్తుతం త్రిష `పొన్నియిన్ సెల్వర్`లో నటిస్తోంది.

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ ప్రారంభం కావాల్సి వుంది. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో జీతు జోసెఫ్ రూపొందిస్తున్న `రామ్` వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.