శుక్రవారం వచ్చింది అంటే చాలు థియేటర్ లో సినిమాలతో పాటు డిజిటల్ స్క్రీన్ లో వెబ్ సీరీస్ ల హంగామా షురూ అవుతుంది. ప్రతి వారం లానే ఈ శుక్రవారం కూడా సినిమా లు సీరీస్ లు రిలీజ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే శివ అన్న పేరు గల పాత్రలతోనే థియేటర్ లో ఒక సినిమా.. డిజిటల్ లో వెబ్ సీరీస్ వచ్చాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ చైతన్య. కస్టడీ అంటూ వచ్చి ఆడియన్స్ ని తన కస్టడీలో ఉంచుకోవాలని వచ్చాడు.
వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. కస్టడీ సినిమాలో నాగ చైతన్య పాత్ర పేరు శివ. సినిమాలో శివగా పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ రోజే ఆహాలో రిలీజైన వెబ్ సీరీస్ న్యూసెన్స్.
కొన్నాళ్లుగా టీజర్ ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన ఈ సీరీస్ కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీరీస్ లో నవదీప్ మెయిన్ లీడ్ గా నటించాడు ఇందులో అతని పేరు కూడా శివనే.. కాకపోతే ఈ సీరీస్ లో నవదీప్ రిపోర్టర్ గా నటించాడు.
ఈరోజు రిలీజైన సినిమా కస్టడీ.. డిజిటల్ రిలీజైన సీరీస్ న్యూసెన్స్ రెండిటిలో హీరో పాత్ర పేరు శివ అవడం క్రేజీ అంటున్నారు ఆడియన్స్. ఇక నాగ చైతన్య కస్టడీ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. సినిమా గురించి ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో చెప్పగా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేదు అన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక న్యూసెన్స్ వెబ్ సీరీస్ కూడా అంతే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సీరీస్ ఆరు ఎపిసోడ్స్ తో రాగా చాలా వరకు ఎపిసోడ్స్ ల్యాగ్ అయినట్టు అనిపించాయి.
సో ఈరోజు థియేటర్ లో.. డిజిటల్ లో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన వారిలో శివ పాత్ర పేరుతో రావడం యాదృశ్చికంగా జరిగినా ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతున్నారు. కస్టడీ ఫైనల్ టాక్ ఏంటన్నది ఈవెనింగ్ వరకు తెలుస్తుంది.