గత నెల రోజులుగా తెగ సందడి చేస్తున్న దసరా సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సినిమాకు ప్రస్తుతానికి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న దసరా సినిమా ప్రమోషన్ లో సిల్క్ స్మిత ఫొటో ఎక్కువగా కనిపిస్తోంది. టైటిల్ లోగోలో కూడా సిల్క్ స్మిత ఫొటోను ఉపయోగించారు. నాని తో పాటు ఇతర యూనిట్ సభ్యులు ధరించిన డ్రస్ లపై దసరా టైటిల్ తో పాటు సిల్క్ స్మిత ఫొటోను కూడా చూడవచ్చు. హీరో నాని సినిమాలో సిల్క్ స్మితకు అభిమాని అయి ఉంటాడు అనేది టాక్.
తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. దసరా సినిమాలో సిల్క్ స్మితను ఇన్వాల్వ్ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటూ మీడియా ప్రశ్నించిన సమయంలో ఆయన మాట్లాడుతూ.. చిన్నతనంలో సింగరేణి గనుల్లో పని చేస్తున్న సమయంలో మా తాత కాలు విరిగింది. ఆయన కోసం ప్రతి రోజు కల్లు తీసుకుని వస్తూ ఉండేవాడిని.
కల్లు దుకాణం వెళ్లిన సమయంలో అక్కడ మొదటి సారి సిల్క్ స్మిత పోస్టర్ ను చూపించాను. అప్పటికి ఆమె ఒక హీరోయిన్.. స్పెషల్ క్యారెక్టర్ చేస్తుందనే విషయం నాకు తెలియదు. అయినా కూడా ఆమె ఫొటో నా మనసులో ముద్రించబడింది. అప్పటి నుండి నేను దర్శకుడిగా అవ్వాలి అనుకున్నంత వరకు కొనసాగుతూనే వచ్చింది.
తన చిన్ననాటి కల్లు దుకాణం జ్ఞాపకాలు సినిమాలో కొన్ని పెట్టే అవకాశం వచ్చింది. అందుకే సిల్క్ స్మిత యొక్క ఫొటోను కూడా వినియోగించినట్లు చెప్పుకొచ్చాడు. సినిమాలో సిల్క్ స్మిత లేకున్నా కూడా ఆమెకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయి అన్నట్లుగా దర్శకుడు పేర్కొన్నాడు.
టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అంటూ దసరా సినిమాపై చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. మరి ఆ స్థాయిలో సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ రాబోతుంది.