మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా తన ఫాం కొనసాగిస్తున్నాడు. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో మెప్పించిన దుల్కర్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యాడు. ఆ తర్వాత సీతారామం సినిమాతో మరో సక్సెస్ అందుకుని ఇక్కడ తన పాపులారిటీ పెంచుకున్నాడు. త్వరలో లక్కీ భాస్కర్ అంటూ రాబోతున్నాడు. ఐతే మహానటి లో జెమిని గణేషన్ పాత్ర అంటే మన హీరోలు ఎవరు కాదన్నారేమో దుల్కర్ కి వెళ్లాడని అనుకోవచ్చు కానీ ఆ తర్వాత సీతారామం లాంటి సూపర్ హిట్ సినిమాను కూడా దుల్కర్ కి ఇచ్చారు.
ఆ సినిమా సర్ ప్రైజ్ హిట్ అందుకుంది. ఇక లక్కీ భాస్కర్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందనిపిస్తుంది. ఐతే లక్కీ భాస్కర్ రిలీజ్ కాకుండానే ఆకాశంలో ఒక తార అంటూ మరో క్రేజీ సినిమా దుల్కర్ బర్త్ డే రోజు ప్రకటించారు మేకర్స్. అదేంటి మలయాళంలో కూడా దుల్కర్ కి ఇంత మంచి ఆఫర్లు వస్తున్నాయో లేదో కానీ తెలుగు నుంచి మాత్రం వరుస భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఆకాశంలో ఒక తార ప్రీ లుక్ పోస్టర్ అనౌన్స్ మెంట్ తోనే సినిమాపై ఒక పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశారు.
ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ కలిసి సమర్పిస్తుండగా సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు. సినిమాను పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్నారు. ఈమధ్య డిస్నీ హాట్ స్టార్ లో వెబ్ సీరీస్ లు చేస్తూ సత్తా చాటిన పవన్ సాధినేని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై తన స్టామినా ప్రూవ్ చేయాలని వస్తున్నాడు. ఆకాశంలో ఒక తార పోస్టర్ చూస్తేనే ఇది కూడా ఒక అద్భుతమైన కథా కథాంశాలతో వస్తుందని అనిపిస్తుంది. మరి ఇంత మంచి కథ తెలుగులో ఎవరు హీరోలు లేరని దుల్కర్ దాకా వెళ్లారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఐతే తెలుగు హీరోలంతా కూడా ఇప్పుడు ఎవరికి వారు వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఒక కథ తమ దగ్గరకు వస్తే కమిటైన సినిమాలన్నీ పూర్తి చేశాక కానీ ఆ ప్రాజెక్ట్ చేసే అవకాశం లేదు. అందుకే వచ్చిన మంచి కథలను కూడా వదిలేయాల్సి వస్తుంది. ఇలాంటి టైం లో ఈ కథకు మన హీరో కాకుండా వేరే హీరో ఎవరా అని చూస్తే దుల్కర్ ఆప్షన్ లోకి వస్తున్నాడు. ఎంచక్కా తెలుగు ఆడియన్స్ తనని ఆదరిస్తున్నారు కాబట్టి వచ్చిన కథల్లో సంథింగ్ ఇంట్రెస్టింగ్ అన్న వాటిని దుల్కర్ పిక్ చేసుకుంటున్నాడు. ఆకాశంలో ఒక తార సినిమాను స్వప్న సినిమాస్ కూడా సమర్పిస్తుంది. దుల్కర్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం వెనుక వారి ప్రమేయం ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగు హీరోలు కాదంటున్నారో లేక బిజీ ఉండి వదిలేస్తున్నారో కానీ ఈ గ్యాప్ లో దుల్కర్ వరుసగా మంచి కథలతో హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు.