స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. సామ్ బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి ఇప్పటికే తెలిసిందే. రాజ్ డీకే తెరకెక్కిస్తున్న సిటడెల్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే దీని కోసం ఆమె ముంబాయి కి వెళ్ళింది. అక్కడ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఆమె తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమాలో నటిస్తోంది. తన ఆరోగ్యం బాగాలేక షూటింగ్లో పాల్గొనలేకపోయింది. ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పటివరకు ఖుషికి తన డేట్స్ ఇచ్చినట్లు లేదు. సమంత మయోటైటిస్ వ్యాధితో బాధపడినప్పుడు తన సినిమాలకు బ్రేక్ వస్తుందని అంతా అనుకున్నారు.
అయితే ఇప్పుడు కొలుకున్నట్లు తెలుస్తుంది. మొదట కోలుకోగానే ఖుషి సినిమా మొదలుపెడతారని అంతా అనుకున్నారు. కానీ వరుణ్ ధావన్ సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించడానికి ముంబై వెళ్ళినట్లు సమాచారం. దీంతో సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్ కి ప్రాధాన్యత ఉందని అంతా అనుకుంటున్నారు.
అక్కడ ఏడు పది రోజుల షూటింగ్ కోసం ముంబై వెళ్ళినట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడ టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఈ స్టార్ హీరోయిన్ కోసం నెలల తరబడి ఖాళీగా కూర్చుంటున్నాడు.
జనవరి 2న విజయ్ తో కలిసి ఖుషి షూట్ లో జాయిన్ అవుతాడని సమంత ఇంతకుముందు మాట ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి రెండో వారం దాకా జాయిన్ అయ్యే పరిస్థితి లేదు.
ఇక ఆమె నటించిన శకుంతలం సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. చూడాలి ఇంకా ఖుషి సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతుందో ఈ అమ్మడు.