మాస్ మహారాజా రవితేజ నటించిన మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన తెరకెక్కించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీలో మాస్ రాజాకు జోడీగా శ్రీలీల నటించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఊహించిని విధంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా భారీ వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది.
ఫస్ట్ డే కొంత వరకు డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్ల పరంగా మాత్రం ఆశ్చర్యపరిచింది. మూడవ రోజు అనూహ్యంగా వసూళ్లు మరింతగా పెరగడంతో ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటలు ఓవర్సీస్ లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల దుమ్ము దులుపుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ టీమ్ ఒకరికి అన్యాయం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో ‘పల్సర్ బైక్’ అనే పాటని ఓ రేంజ్ లో వాడేశారు.
ఇదొక నప్రైవేట్ సాంగ్..అయితే సందర్భాను సారంగా ఈ పాటని సినిమాలో రవితేజ ‘గాజువాక కండర్టర్ పాటేయండ్రోయ్ .. ‘ అని ఈ పాట వేయించుకున్నారు. సినిమాలో ఈ పాట ఆడియన్స్ని ఓ రేంజ్ లో ఊపు ఊపేసింది. ఇప్పటికే ఈ పాటని ‘శ్రీదేవి డ్రామా సెంటర్’ కామెడీ షోలో గాజువాక కండక్టర్ ఝూన్సీ ప్రదర్శించింది.
అయితే ఈ పాట తనది కాదు. రమణ అనే కుర్రాడిది. సినిమాలో మాత్రం గాజువాక కండక్టర్ పాట అంటూ ప్రమోట్ చేశారు. అది ఈ పాట సృష్టికర్త రమణకు ఇబ్బంది కలిగిస్తోందట.
పాట తను రాస్తే కండక్టర్ ఝాన్సీకి క్రెడిట్ ఇవ్వడం రమణని తొక్కేయడమేననే కాఎంట్ లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అతనికి ‘ధమాకా’ టీమ్ అన్యాయం చేసిందని పలువురు వాపోతున్నారు. అయితే చిత్ర బృందం మాత్రం ఈ పాట విషయంలో రమణకు బాగానే ముట్టజెప్పిందని పేరు విషయంలో మాత్రమే అన్యాయం చేస్తోందని ఇన్ సైడ్ టాక్.
రైటర్ రమణ కూడా ఇదే ఫీలవుతున్నాడట. ఇదిలా వుంటే ‘ధమాకా’ మూవీలో ‘పల్సర్ బైక్’ పాటని పాపులర్ చేయడంతో రవితేజ అభిమానులు ఈ పాటని యూట్యూబ్ లో తెగ చూసేస్తూ వైరల్ చేస్తున్నారట.