నటుల మధ్య వార్..తప్పెవరిది?

కోలీవుడ్ నటులు విష్ణు విశాల్-సూరి మధ్య కొన్నాళ్లగా ల్యాండ్ డీలింగ్ కి సంబంధించి వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. 2.7 కోట్లు మోసం చేసి తీసుకున్నారంటూ సూరి రెండేళ్ల క్రితం కోర్టులో కేసు వేసాడు. అప్పటి నుంచి ఈ వివాదం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఈ వివాదంపై విష్ణు విశాల్ స్పందించాడు.

తప్పు నావైపు ఉంటే డబ్బు ఇచ్చేవాడిని. అలా లేనప్పుడు డబ్బు ఇచ్చి నేను తప్పు చేసిన వాడినవుతానా? సోషల్ మీడియాలో కొందరు డబ్బులు తిరిగి ఇచ్చేయండి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు అవి నాకు కోపం తెప్పిస్తున్నాయి. 2.7 కోట్లు తిరిగి ఇవ్వలేని వాడిని అనుకుంటున్నారా? అదేమి నాకు పెద్ద విషయం కాదు. కానీ ఇస్తే తప్పు చేసిన వాడనవుతా. సూరి పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి రావడం..నేను పెద్ద పలుకుబడి ఉన్నవాడిని కావడంతో అంతా నన్నే ఏలెత్తి చూపిస్తున్నారు.

సినిమాల్లోకి ఎలాంటి కష్టాలు తెలియకుండా వచ్చానని అనుకుంటున్నారు. ఇక్కడ నిలబడాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. అవి ఎలా ఉంటాయో పట్టవాడికి మాత్రమే తెలుసు` అని అన్నారు. మరోవైపు సూరి వాదన మరోలా ఉంది. తనని మోసం చేసారంటూ మండిపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరి తప్పు? ఎవరు రైట్ ? అన్నది తేలని పంచాయతీగా మారింది.

ఇక సూరి-విష్ణు విశాల్ మంచి స్నేహితులు . ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య డబ్బు విరోధం తెచ్చింది. బలమైన స్నేహాన్ని ఆ డబ్బు తుంచేసింది. నేడు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ప్రత్యారో పణలు చేసుకుంటున్నారు. ఆ కారణంగా సోషల్ మీడియాలో అభిమానుల దుర్భాషలాడుకుంటున్నారు. మరి ఈ తెగని పంచాయతీకి ఎలాంటి పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.