నమ్రత కుర్తా ధర రూ.4లక్షలా?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూడా అందరికీ పరిచయమే. ఆమె కూడా ఒకప్పటి హీరోయినే. మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. కాగా సినిమాలకు దూరమైనా నమ్రత సోషల్ మీడియాలో చురుకుగానే ఉంటారు. తన ఫ్యామిలీ బయట ట్రిప్ కి వెళ్లినప్పటి ఫోటోలు తన కూతురి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

వారి ఫోటోలను కూడా ఆమె చాలా రేర్ గా సెలెక్టివ్ గా పెడుతూ ఉంటారు. కాగా ఇటీవల మహేష్ నమ్రత జంట ఓ పార్టీకి హాజరయ్యారు. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ బేబీ షవర్ కార్యక్రమం అది. ఆ ఫోటోలు బయటకు రాగా అవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువ మంది మహేష్ ని చూసి మెస్మరైజ్ అయ్యారు. ఈ వయసులోనూ ఇంత హ్యాండసమ్ గా ఎలా ఉన్నారు అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ తాజాగా నమ్రత ధరించిన డ్రెస్ గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

నమ్రత ఈ ఫోటోల్లో జార్జియో అర్మానీ కుర్తా ధరించారు. ఆ కుర్తా పై గ్రాఫిక్ ఫ్రింట్ ఉండటం గమనార్హం.లాంగ్ స్లీవ్స్ మిడ్ లెంగ్త్ ఉన్న ఈ కుర్తా చూడటానికి చాలా సాధారణంగానే కనపడుతుంది. కానీ దాని ధర చూశాక చాలా మంది ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.

ఇంతకీ ఆ కుర్తా ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.4లక్షలు. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. దీంతో ప్రస్తుతం ఆమె డ్రెస్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. కాగా ఆ డ్రెస్ లో ఆమె హెయిర్ ని సింపుల్ గా వదిలేశారు. డైమండ్ ఇయర్ రింగ్స్ ధరించారు. చాలా మినిమల్ మేకప్ ఆమె ధరించడం విశేషం. ఏది ఏమైనా ఆమె డ్రెస్ ధర మాత్రం టాప్ ఆఫ్ ది సోషల్ మీడియా గా మారింది.

ఇక ఈ పార్టీకి మహేష్ కూడా వచ్చారు ఆయన నేవీ బ్లూ కలర్ టీషర్ట్ ఫార్మల్ ప్యాంట్ లో చాలా సింపుల్ గా కనిపించాడు. ఈ జంట తమ ముద్దుల కుమార్తె సితారతో కలిసి ఈ పార్టీకి రావడం విశేషం. ప్రముఖ వ్యాపారవేత్త జివికె రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర్ పార్టీ ఇది కావడం విశేషం. ఈ ఫోటోలను నమ్రత స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం సినిమా లో నటిస్తున్నారు. ఈ మూవీకి తివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటించనున్నారు.