చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శకులు ఇప్పుడు బిగ్ స్టార్స్ పై కన్నేశారు. కొంత మంది టైర్ టు హీరోలతో క్రేజీ సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరి కొంత మంది దర్శకులు మాత్రం క్రేజీ స్టార్ లతో పాన్ ఇండియా మూవీస్ చేయడానికే ప్రధాన్యత నిస్తున్నారు. కరోనా తరువాత దక్షిణాది సినిమాల మార్కెట్ విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ స్టార్ హీరో డైరెక్టర్ భారీ పాన్ ఇండియా లెవెల్ సినిమాలపైనే వుంది. ఈ నేఫత్యంలో చాలా వరకు డైరెక్టర్లు చిన్న చిన్న హీరోలతో కాకుండా బిగ్ స్టార్స్ తో సినిమాలకు రెడీ అవుతున్నారు.
ఇందులో భాగంగానే నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని స్టార్ హీరో తల అజిత్ తో చేయాలని రెడీ అయిపోయాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించాలని ప్లాన్ చేశారు.
అజిత్ 62వ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకురావాలనుకున్నారు. అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లడమే అని అన్నారు. నయనతో పెళ్లి పిల్లలు ఇలా హ్యాపీగా సాగుతున్న విఘ్నేష్ కెరీర్ అజిత్ ప్రాజెక్ట్ తో నెక్స్ట్ లెవెల్ కి చేరడం ఖాయం అనే వార్తలు కూడా వినిపించాయి.
కట్ చేస్తే.. అజిత్ ప్రాజెక్ట్ విఘ్నేష్ శివన్ చేజారింది. దీంతో భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న విఘ్నేష్ శివన్ కు ఒక్కసారిగా అజిత్ షాకిచ్చాడట. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఏకె62 అనౌన్స్ మెంట్ పిక్ ని తొలగించాడు. ఉన్నట్టుండి విఘ్నేష్ శివన్ కు అజిత్ షాకివ్వడానికి కారణం ఏంటనేది ఆరాతీస్తే ఆసక్తికరమైన ఓ విషయం బయటికి వచ్చింది. విఘ్నేష్ శివన్ చెప్పిన కథ అజిత్ కు పెద్దగా నచ్చలేదట.
అందులో మార్పులు చేర్పులు చేయాలని అజిత్ చెప్పినా విఘ్నేష్ శివన్ అందుకు అంగీకరించలేదట. దీంతో ఈ స్టోరీ కాకుండా మరో స్టోరీతో సినిమా చేద్దామని అజిత్ చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త కథ అంటే ఇప్పుడు కుదరదు. కాస్త టైమ్ కావాలి. అందుకే 62వ మూవీని మరో దర్శకుడు మగిళ్ తిరుమేనితో చేస్తానని 63వ ప్రాజెక్ట్ ని విఘ్నేష్ శివన్ తో చేస్తానని అజిత్ మాటిచ్చారట. ఇదే విషయాన్ని లండన్ వెళ్లి లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ కు వెల్లడించనున్నారట.
ఇదిలా వుంటే అజిత్ 62వ మూవీని మగిళ్ తిరుమేని అనే దర్శకుడితో ప్రారంభించబోతున్నారని తెలిపింది. ఫిబ్రవరి రెండవ వారంలో ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసి అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ తో పాటు అజిత్ 63వ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.