నాగ్..మ‌హేష్ ఇద్ద‌రు అందులో స్పెష‌ల్

టాలీవుడ్ సెల‌బ్రిటీల డైట్ ప్లాన్ అనేది ఒక్కో హీరోది ఒక్కోలా ఉంటుంది. అందులో స్పెష‌ల్ గా క‌నిపించేది ఎవ‌రంటే? కింగ్ నాగార్జున‌..సూప‌ర్ స్టార్ మ‌హేష్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత మంది హీరోలు డైట్ ఫాలోచేసినా… ఆ ఇద్ద‌రు మాత్రం డైట్ విష‌యంలో ఎవ్వెర్ గ్రీన్ అన‌డంలో డౌట్ లేదు. ఇద్ద‌రు డైట్ విష‌యంలో చాలా క‌ఠినంగా ఉంటారు. సినిమాలో పాత్ర‌కి ఫిజిక్ అవ‌స‌రం అనుకుంటే అవ‌స‌రం మేర విదేశాల నుంచి న్యూట్రీషియ‌న్స్..డైటీష‌న్స్ సీన్ లోకి తెస్తారు.

ఇక రెగ్యుల‌ర్ లైఫ్ స్టైల్ విష‌యానికి వ‌స్తే మ‌హేష్ ఉప్పుకారం లేకుండా వీలైనంత వ‌ర‌కూ చ‌ప్ప‌గా ఉండే ఐట‌మ్స్ ఎక్కువ‌గా తీసుకుంటారు. కారం-ఉప్పు ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవ‌డం అన్న‌ది చాలా రేర్. అదీ విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే బ‌య‌ట తీసుకుంటారు. హైద‌రాబాద్ లో ఉంటే ఇండి ఫుడ్ త‌ప్ప ఇంకే తీసుకోరు. హైద‌రాబాద్ బిరియానీ ఏడాదికి ఒక‌సారి మాత్ర‌మే తింటారుట‌. షూటింగ్ ఉన్నా లేక‌పో యినా మ‌హేష్ డైట్ ఇలాగే ఉంటుంది.

షూటింగ్ లేద‌ని నాలుకకు రుచి అల‌వాటు చేస్తే ప్ర‌మాద‌క‌రంగా భావించి ఉప్పుకారం జోలికి వెళ్ల‌రు. ఉద‌యం క్ర‌మం త‌ప్ప‌కుండా జిమ్ చేయ‌డం… ఆ త‌ర్వాత మితంగా ఆహారం తీసుకోవ‌డం…మ‌ధ్నాహ్నం త‌క్కువ‌గా రైస్..రోటీ..క‌ర్డ్ తీసుకుంటారు. ఇక రాత్రిపూట వీలైనంత వ‌ర‌కూ ఎక్కువ‌గా పండ్ల మీద‌నే ఉంటా రుట‌. శ‌రీరానికి అవ‌స‌ర‌మైన వాట‌ర్ క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటారు. అందుకే మ‌హేష్ అంత అందంగా ఉన్నాడు. సంక్రాంతి..ద‌స‌రా వ‌చ్చింద‌ని ఒక్క రోజు పండుగ కోసం నాలుక‌కి రుచి అల‌వాటు చేయ‌ని హీరో అత‌ను. ఇక నాగార్జున రెగ్యుల‌ర్ గా జిమ్ చేస్తారు.

ఇష్ట‌మైన‌వి అన్నీ తీసుకుంటారు. కానీ మితంగా. ఎక్కువ‌గా వాట‌ర్ తాగుతారు. అత‌ని గ్లామ‌ర్ సీక్రెట్ కూడా వాట‌ర్ అని చెప్పిన సంద‌ర్భాలెన్నో. మ‌ధ్నాహ్నం త‌క్కువ మోతాదులో రైస్ ..క‌ర్డ్ తీసుకుంటారు. నాన్ వెజ్ కూడా చాలా త‌క్కువ‌గానే తింటారు. అలాగే రాత్రి డిన్న‌ర్ మాత్రం 6 గంట‌ల లోపు పూర్త‌వుతుంది. ఆ త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లో ఎలాంటి ఆహార ప‌దార్దాలు తీసుకోరు. టైమ్ టూ టైమ్ నిద్ర‌పోతారు. ఈ విష‌యంలో నాగార్జున ని ఏ హీరో కూడా మ్యాచ్ చేయ‌లేరు. అందుకే నాగ్ ఇప్ప‌టికీ అంతే గ్లామ‌ర్ తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు.