నాని కన్ఫ్యూజ్ అవుతున్నాడా?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది దసరా, హాయ్ నాన్న మూవీలతో రెండు సూపర్ హిట్లు అందుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నానితో అంటే సుందరానికి మూవీ తీసిన వివేక్ ఆత్రేయ.. సరిపోదా శనివారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. నాని మూడు చిత్రాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. దసరాతో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సాహో ఫేమ్ సుజిత్ తో వర్క్ చేయనున్నట్లు బర్త్ డే కానుకగా వెల్లడించారు. వీటితోపాటు బలగం వేణుకు కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే చేతి నిండా సినిమాలు ఉన్నా.. వాటిని స్టార్ట్ చేసే విషయంలో మాత్రం నాని సందిగ్ధంలో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. బలగం వేణు ప్రాజెక్ట్ ఇప్పటికే క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. సుజిత్ మూవీ కూడా హోల్డ్ లోకి వెళ్లిపోయిందని సమాచారం. ప్రస్తుతానికి ఆయన చేతిలో శ్రీకాంత్ ఓదెల సినిమా మాత్రమే ఉంది. అందుకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం నాని వేరే దర్శకులతో కొత్త ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ డైరెక్టర్లు చెప్పిన కథలు విన్నాక.. సెలక్షన్ విషయంలో నేచురల్ స్టార్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల బడా డైరెక్టర్ తో నాని ప్రొసీడ్ అవ్వాలనుకున్నారని.. కానీ అది వర్కౌట్ అవ్వలేదని సినీ వర్గాల్లో వినికిడి. ప్రస్తుతం మిడ్ రేంజ్ దర్శకుల నుంచి విభిన్నమైన కథలు నాని ఆశిస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, శ్రీకాంత్ ఓదెలతో చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. సరిపోదా శనివారం అయ్యాక హిట్-3ని స్టార్ట్ చేయాలని నాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హిట్-3 స్క్రిప్ట్ ను నానికి శైలేష్ కొలను నేరేట్ చేశారట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. మరి నాని నెక్స్ట్ ఏ సినిమా పట్టాలెక్కిస్తారో? ఏ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో? వేచి చూడాలి.


Recent Random Post: