నిజంగానే శ్రీరెడ్డి పెళ్లి చేసుకుందా?

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శ్రీరెడ్డి ఎప్పుడూ ఏదొక సంచలన ఆరోపణ చేస్తుంటుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసి వివాదాలు కొనితెచ్చుకుంటుంది. ఇక్కడ మీటూ ఉద్యమంతో దుమ్ము లేపిన శ్రీరెడ్డి ఆ తర్వాత చెన్నై వెళ్లి అక్కడే సెటిలయ్యింది. తెలుగు ఇండస్ట్రీ మీద ఆరోపణలు చేస్తూ తమిళ సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైలోనే మకాం వేసింది.

అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉండే శ్రీరెడ్డి పెళ్లి విషయంలో కూడా చాలా డేరింగ్ స్టేట్మెంట్లు గతంలో ఇచ్చింది. ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. అయితే కొన్నాళ్ళు సైలెంట్ అయిన శ్రీరెడ్డి ఇప్పుడు మళ్ళీ టిక్ టాక్ వీడియో రూపంలో సంచలనం సృష్టించింది.

మెడలో తాళిబొట్టుతో, నుదుటిన సింధూరంతో శ్రీరెడ్డి టిక్ టాక్ చేయడంతో ఆమెకు పెళ్ళైపోయిందా అన్న సందేహాలు కలిగాయి. అయితే ఆ వీడియో కింద క్యాప్షన్ గా నాకు పెళ్ళవలేదు, ఇది కేవలం వీడియో వరకే అన్న స్టేట్మెంట్ ఇచ్చినా కానీ శ్రీరెడ్డి వ్యక్తిత్వం తెలిసిన వాళ్లకు.. దిల్ రాజు, నిఖిల్, రంగస్థలం మహేష్ లాగ సైలెంట్ గా ఏమైనా వివాహం చేసుకుందేమోనన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఏమో శ్రీరెడ్డి డేరింగ్ తెలిసిన వాళ్లకు పెళ్ళైనా అవ్వవ్వొచ్చు అంటున్నారు.