ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. మొదటి సినిమా నుండి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన గార్గీ సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా తన అందంతో పాటు నటనతో మెప్పించిన టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నిలిచింది.
స్కిన్ షో చేయకుండా ఇంత స్టార్డం తప్పించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవికి అభిమానులు పేరు పెట్టుకున్నారు. ఆ పేరుకు సాయి పల్లవి పూర్తిగా అర్హురాలు అంటూ మరోసారి నిరూపితమైంది.
తాజాగా ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఫంక్షన్ లో సాయి పల్లవి సందడి చేసింది. గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన గార్గీ సినిమాలో అత్యుత్తమ నటనని ప్రదర్శించినందుకు గాను బెస్ట్ హీరోయిన్ అవార్డుని సాయి పల్లవి సొంతం చేసుకుంది. ఈ అవార్డుని అందుకోవడానికి రెడ్ చీరలో మెరిసిన సాయి పల్లవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఏదైనా చిన్న ఫంక్షన్ లో.. లేదా ఏదైనా ఈవెంట్లో కనపడితే ఆయన ఫోటోలు ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహాలో సాయి పల్లవి రెడ్ చీర కట్టు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందుకే సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని పిలవడంలో సందేహం లేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ సాయి పల్లవి కొత్త సినిమాలకు కమిటీ అవ్వక పోవడం పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సాయి పల్లవి నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపించడం లేదు.
కోట్ల పారితోషికం ఆఫర్ చేసినా సాయి పల్లవి లైట్ తీసుకుంటుంది. ఇక మీదట అయినా సాయి పల్లవి లేడీ ఓరియంటెడ్ సినిమాలు లేదా కమర్షియల్ సినిమాలకి ఓకే చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.