నితిన్‌ పెళ్లి వార్తలపై క్లారిటీ

యంగ్‌ హీరో నితిన్‌ వివాహం గత నెల ఏప్రిల్‌ లో జరగాల్సి ఉంది. దుబాయిలో భారీ ఎత్తున డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కు ప్లాన్‌ చేశారు. కాని కరోనా కారణంగా పెళ్లి వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయడం ఉత్తమం అనే అభిప్రాయంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. అందుకే పెళ్లిని ఏకంగా డిసెంబర్‌ వరకు వాయిదా వేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఈ విపత్తు నుండి బయట పడ్డ తర్వాతే పెళ్లి ప్రస్థావన తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చారట.

యంగ్‌ హీరో నిఖిల్‌ పెళ్లితో పాటు పలువురు ఈ విపత్తు సమయంలోనే పెళ్లికి సిద్దం అయ్యారు. అలాగే నితిన్‌ కూడా పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల లేదా వచ్చే నెలలో వివాహం జరిగే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సన్నిహితుల సమక్షంలో నితిన్‌ వివాహం జరుగబోతుందని ప్రభుత్వం ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ తక్కువ సంఖ్యలో బంధు మిత్రుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నట్లుగా వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని క్లారిటీ వచ్చేసింది.

నితిన్‌ పెళ్లి విషయంలో తొందర పడటం లేదని.. సుధీర్ఘ కాలంగా శాలినితో ప్రేమలో ఉన్న ఈయన మరికొంత కాలం వెయిట్‌ చేద్దామని ఫిక్స్‌ అయ్యాడు. డిసెంబర్‌ వరకు పరిస్థితులు కుదుట పడితే పెళ్లి ఘనంగా చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పటికి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం సింపుల్‌గా పెళ్లిని ముగించేయాలని అనుకుంటున్నారట.