నిర్మాత ఆస్తులు అమ్ముకున్నాడు.. కంగనా ఏమందంటే!


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమా సినిమా కు తన స్టార్ డమ్ ను కోల్పోతు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈమె గత సినిమాలు కమర్షియల్ గా ప్లాప్ అయ్యాయి. అయినా కూడా ధడక్ సినిమా ను బాలీవుడ్ నిర్మాత దీపక్ ముకుత్ ఏకంగా రూ.85 కోట్లకు పైగానే ఖర్చు చేసి నిర్మించాడు. ఇటీవల విడుదల అయిన ధడక్ సినిమా కనీసం అయిదు కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది.

వంద కోట్లు వసూళ్లు సాధిస్తుందని భావించిన సినిమా కనీసం 5 కోట్లు కూడా వసూళ్లు చేయక పోగా కనీసం వారం రోజులు కూడా థియేటర్ లో నిలువలేక పోవడం అనేది దారుణం. కంగనా తన సినిమాల విడుదలకు ముందు చేస్తున్న హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. బాలీవుడ్ నుండి మొదలుకుని పొలిటికల్ విషయాల వరకు మాట్లాడుతూ తన సినిమాకు ప్రమోషన్ చేస్తుంది.

చివరకు సినిమా లో మ్యాటర్ ఉండక పోవడంతో మొత్తం సినిమా ఫలితం తారుమారు అవుతుంది. సినిమా మినిమం గా ఉన్నా కూడా జనాలు ఆధరించే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. అందుకే ధకడ్ సినిమా నాలుగు కోట్ల వసూళ్ల వద్ద ఆగిపోయినట్లుగా చర్చించుకుంటున్నారు. సినిమా దారుణమైన నష్టాలను చవిచూడటంతో నిర్మాత దీపక్ తన ఆస్తులను అమ్మేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తలపై కంగనా ఫైర్ అయ్యింది. సినిమా ప్లాప్ తో నిర్మాత ఆస్తులు అమ్ముతున్నట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నిజానికి ఈ సినిమా పట్ల ఆయన చాలా పాజిటివ్ గానే ఉన్నాడు. సినిమా గురించి వచ్చిన బ్యాడ్ కామెంట్స్ మరియు బ్యాడ్ టాక్ వల్లే సినిమా ప్లాప్ అయ్యిందని కంగనా బల్ల గుద్ది మరీ చెప్పింది.

ఈమద్య వచ్చిన గంగూభాయ్.. జగ్ జగ్ జియో.. 83 సినిమాలకు ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయలేదు.. ఇలాంటి రాతలు మీడియా వారు ఎందుకు రాయలేదు అంటూ కంగనా ప్రశ్నించింది. తన సినిమా అనగానే చాలా మందికి నెగటివ్ పాయింట్స్ గుర్తుకు వస్తున్నాయి అన్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

మొత్తానికి మీడియా వల్లే ధడక్ సినిమా ప్లాప్ అయ్యింది తప్ప తన సినిమా బాగోలేక ప్లాప్ అవ్వలేదు అంటూ తన సినిమా ను తానే హిట్ అనేసుకుంది. కంగనా ముందు ముందు ఏ సినిమా చేసినా కూడా ఇదే పరిస్థితి అనే భయం ను నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇక నుండి ఆమె సినిమాల బడ్జెట్ విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి.