నిహారిక కు ఏం తక్కువ..? మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్..!

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంచు లక్ష్మి. ఆమె టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకోవాలనే నమ్మకంతో అడుగుపెట్టారు. కానీ ఆమె అనుకున్నట్లుగా ఛాన్సులు మాత్రం అందుకోలేకోయింది. పైగా ఆమె మాట్లాడే తీరును భయంకరంగా ట్రోల్ చేశారు. మొదట ఆమె టీవీ షో చేశారు. అప్పటి నుంచే ఆమెను విపరతంగా ట్రోల్ చేయడం ఇమిటేట్ చేయడం లాంటివి చేశారు. అయితే ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఆమె ఏ మాత్రం పట్టనట్లే వ్యవహరించేవారు.

ఆమె ఏదైనా మంచి చేస్తే ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడరు. కానీ ఆమె ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడితే మాత్రం వైరల్ చేస్తారు. తాజాగా అదే జరిగింది. ఓ ఇంటర్వ్యూలో తెలుగు అమ్మాయిలకు తెలుగులోనే అవకాశాలు ఇవ్వడం లేదు అని ఆమె గట్టిగానే కౌంటర్లు వేశారు. తనకే కాదు తెలుగు అమ్మాయిలు ఎవరికీ ఛాన్స్ లు ఇవ్వడం లేదని అలా ఇవ్వకపోవడానికి తెలుగు ప్రేక్షకులే కారణం అన్నారు.

తానొక హాలీవుడ్ నటినని తెలుగు ప్రజలకు దగ్గరౌదామని ఇక్కడికి వచ్చానని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడికి ఎందుకు వచ్చాను రా దేవుడా అని అనిపిస్తూ ఉంటుందని ఆమె అన్నారు. పెళ్లి తర్వాత పిల్లలు కావాలంటే ఇండియాలో ఉంటే మంచిదని ఇక్కడకు వచ్చానని లేకపోతే తన కెరీర్ మరోలా ఉండేదన్నారు. తన కూతురు ఇప్పుడు కొంచెం పెద్దది అయ్యిందని తాను మళ్లీ హాలీవుడ్ కి వెళ్లిపోతానని ఆమె చెప్పడం విశేషం.

తనకు మాత్రమే కాదని చాలా మంది తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు ఇవ్వలేదన్నారు. నిహారిక శివాని శివాత్మికలకు ఏం తక్కువ అని ప్రశ్నించారు. మధుశాలిని బింధు మాధవి లాంటివాళ్లు ఎందుకు సినిమాలు చేయలేకోతున్నారని అన్నారు.

ఈ ప్రశ్నలు తాను తెలుగు ప్రేక్షకులను అడుగుతున్నానని చెప్పారు. ఇక్కడివారందరికీ కేరళ తమిళ పంజాబీ ముంబై మధ్యప్రదేశ్ గుజరాతీ అమ్మాయిలే కావాలని తెలుగు గర్ల్స్ మాత్రం వద్దు అన్నారు.

ఇక తాను ప్రొడక్షన్ లో తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలని ఉన్నా తనకే లేదని ఇక వారికి ఏం ఛాన్సులు ఇస్తాను అనే భావన కలుగుతోందన్నారు. ఇక్కడి అమ్మాయిలను ప్రోత్సహించి ఉంటే తామంతా మంచి పొజిషన్ లో ఉండేవాళ్లమని చెప్పారు.