నిహారిక వల్ల ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యాం: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికకు ఇటివలే చైతన్యతో నిశ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే. కూతురు గురించి ఎంతో ఆత్మీయత, ప్రేమతో కూడిన ట్వీట్ చేసి తండ్రి ప్రేమ ఎలాంటిదో నిరూపించారు. ఎన్నో సందర్భాల్లో నిహారిక అంటే తనకు ఎంత ప్రేమో, తానెంత అల్లరి చేస్తుందో చెప్పేవారు. ప్రస్తుతం నిహారికకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని నాగబాబు రివీల్ చేశారు. జీ తెలుగులో బాపు బొమ్మకు పెళ్లంట అనే ఈవెంట్ లో నిహారికతో ఉన్న అనుబంధాన్ని పంచుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బాపు బొమ్మకు పెళ్లంట’ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో నిహారికపై ఉన్న ప్రేమను నాగబాబు వివరించారు.

ఓసారి ఫ్యామిలీతో కలిసి నాగబాబు న్యూజిలాండ్ వెళ్లారట. అక్కడ పర్యటిస్తున్న సమయంలో చిన్న కన్ఫూజన్ జరిగిందట. నల్లకోటు వేసుకున్న వ్యక్తిని చూసి తండ్రి నాగబాబు అనుకుని నిహారిక అతనితో వెళ్లిపోయిందట. దీంతో నిహారిక ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు 20 నిముషాలపాటు నిహారిక కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారట. ఏం చేయాలో తెలీని పరిస్థితుల్లో దేశంలో ఉన్న వారందరినీ చంపేయాలన్నంత కోపం నాగబాబుకు వచ్చిందట. వరుణ్ తేజ్ ను ఇంటికి పంపించేసి తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆలోచనలు వచ్చాయట.

నిహారిక లేకపోతే తాను ఉన్నా లేనట్టే అని భావించారట. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప నిహారిక లాంటి ఏంజెల్స్ పుడతారని నాగబాబు చెప్పుకొచ్చారు. నిహారిక నాకు ఏంజెల్.. అంటూ కుమార్తెపై తన ప్రేమను వివరించారు ఈ మెగా బ్రదర్.