జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ సహా జనసేన కార్యకర్తల్లో, అభిమానుల ఆనందానికి అవదుల్లేవ్. పవన్ ప్రమాణ స్వీకారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఘనంగా కేసరపల్లిలోని ఐటీఆర్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. భారీ ఎత్తున పవన్ అభిమానులు హాజరయ్యారు.
పవన్ నినాదాలతో ప్రాంగణం మారుమ్రోగుతుంది. మెగాకుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఇక పవన్ కుమారుడు అకీరానందన్, కుమార్తె ఆద్య కూడా వేడుకను లైవ్ లో వీక్షిస్తున్నారు. అయితే అకీరా, ఆద్య తండ్రి ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేకంగా ముస్తాబయ్యారు. ఉదయానే లేచి తల స్నానం చేసి సంప్రదాయ దుస్తుల్లో రెడీ అయ్యారు. ఆద్య పంజాబీ డ్రెస్ ధరించగా, అకీరా రెడ్ కలర్ షర్ట్…తెల్ల పంచె ధరించాడు. ఇంతవరకూ అకీరా ఎప్పుడూ పంచె ధరించలేదు. తొలిసారి పంచె ధరించి సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతున్నాడు.
అనంతరం బిడ్డలిద్దరు తల్లికి వేదిక వద్ద నుంచి లైవ్ లో వీడియో కాల్ చేసి మాట్లాడారు. వారి ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. `నాన్నకు ముఖ్యమైన రోజు కోసం నా క్యూటీస్ ఇలా సిద్దమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సమాజానికి మంచి చేయాలని ఆకాంక్షించే కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.
ఇక అకీరా చేతి పిడికిలి బిగించి జనసైనికుల్లో ఐక్యతని గుర్తు చేసాడు. ఆద్య మాత్రం టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి రెండు ఏళ్లు చూపిస్తూ అభివాదం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ , ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు వాటిని చూసి మురిసిపోతున్నారు. జైజనసేన, జైటీడీ, జైబీజేపీ అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే మూడు పార్టీల కండువాలు కూడా వైరల్ చేస్తున్నారు.