పవన్ సాయి తేజ్ మూవీ.. మరో కొత్త టైటిల్ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్టైన వినోదయ సీతం రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. ఆల్రెడీ గోపాల గోపాల సినిమాలో పవన్ లార్డ్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఇక ఈ సినిమాలో కూడా పవన్ దేవుడిగా తన మాయలు చూపించనున్నారు.

త్రివిక్రం ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ సినిమాకు టైటిల్ గా దేవర దేవుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు రాగా లేటెస్ట్ గా దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ ని పెట్టే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. నాగార్జున మన్మథుడు సినిమాలో సూపర్ హిట్ సాంగ్ అది. ఆ టైటిల్ నే సినిమాగా పెట్టబోతున్నారని టాక్. ఈ సినిమాకు ఆల్రెడీ పవన్ తన పోర్షన్ పూర్తి చేశాడు. సాయి ధరం తేజ్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.

ఈ సినిమాను జూన్ 28న రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ హరి హర వీరమల్లు రెండేళ్లుగా సెట్స్ మీద ఉన్నా ఆ సినిమాకు రిలీజ్ మోక్షం రాలేదు కానీ వినోదయ సీతం రీమేక్ కి మాత్రం తర్వాత రిలీజ్ ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత పవన్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సుజిత్ తో ఓజీ సినిమాలు చేస్తున్నారు. పాలిటిక్స్ సినిమాలు రెండిటినీ టైం బ్యాలెన్స్ చేస్తూ పవన్ బిజీ బిజీగా ఉంటున్నారు.

మరోపక్క సాయి ధరం తేజ్ కూడా లేటేస్ట్ గా విరూపాక్ష తో హిట్ అందుకోగా పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమా కూడా హిట్ పక్కా అనేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత సాయి తేజ్ సంపత్ నందితో సినిమా ఫిక్స్ చేసుకున్నారు.