పవన్ సినిమా తర్వాత 2004 లో వచ్చిన సినిమాకు సీక్వెల్..!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్న ఏ ఎమ్ రత్నం ఇక మీదట వరుసగా సినిమాలను నిర్మించబోతున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హరి హర వీరమల్లు సినిమా పూర్తి అయిన తర్వాత తమ బ్యానర్ లో 2004 సంవత్సరంలో వచ్చి సూపర్ హిట్ అయిన 7/జి బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

2004 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం మరియు తెలుగు లో ఏక కాలంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ద్వి భాష చిత్రం అక్కడ ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ ను కూడా నమోదు చేయడం జరిగింది.

తెలుగు మరియు తమిళంలో సూపర్ హిట్ అయిన 7/జి బృందావన్ కాలనీ సినిమా ను హిందీతో పాటు ఇంకా పలు భాషల్లో కూడా రీమేక్ చేయడం జరిగింది. ఈ సినిమా విడుదల అయిన అన్ని చోట్ల.. రీమేక్ అయిన అన్ని చోట్ల కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమా యొక్క సీక్వెల్ పై నిర్మాత ఏఎమ్ రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ సీక్వెల్ లో మొదటి పార్ట్ లో హీరోగా నటించిన రవి కృష్ణ నటించబోతున్నట్లుగా పేర్కొన్నాడు. సీక్వెల్ కోసం దర్శకుడు సెల్వ రాఘవన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు.

7/జి బృందావన్ కాలనీ సినిమా లో హీరోగా రవికృష్ణ నటించగా హీరోయిన్ గా సోనియా అగర్వాల్ నటించింది. కీలక పాత్రల్లో సుమన్ శెట్టి.. చంద్రమోహన్ ఇంకా ప్రముఖ నటీ నటులు నటించారు. మరి ఇప్పుడు సీక్వెల్ ఆ కథకు కొనసాగింపుగా ఉంటుందా.. లేదంటే కొత్త కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందా అనేది చూడాలి.