పవిత్రతో పెళ్లి.. ఇది నరేష్ ఆన్సర్!

నరేష్ పవిత్ర లోకేష్ వీరిద్దరి ప్రేమాయణం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారితో విడిపోయి నరేష్.. ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్న పవిత్ర లోకేష్ ఇద్దరూ అఫైర్ నడిపిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వీరిద్దరి ప్రేమాయణం చాలా కాలం నుండి సోషల్ మీడియాలో ప్రధాన స్రవంతి మీడియాలో కనిపిస్తూనే ఉంది.

లేటు వయస్సులో వీరిద్దరి ఘాటు ప్రేమ గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఉంటున్నారని ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న విషయం తెలిసినా వారు అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు.

కొన్ని రోజుల క్రితం వీరిద్దరి పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది మళ్లీ పెళ్లి సినిమాలోనిదని తెలిసి అందరూ షాక్ అయ్యారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో నరేష్ పవిత్ర లోకేష్ కలిసి మళ్లీ పెళ్లి సినిమాను తెరకెక్కించారు.

ఈ చిత్రాన్ని నరేష్ సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. ఈ సందర్భంగా నరేష్ ను చుట్టుముట్టిన మీడియా.. మీ ఇద్దరికి పెళ్లి జరిగిందా అని ప్రశ్నించారు.

జర్నలిస్టులు అడిగి ప్రశ్నకు నరేష్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘కొందరు తాళి కడతారు. కొందరు రింగులు మార్చుకుంటారు. ఇంకో మతం వాళ్లు ఇంకో తీరుగా పెళ్లి చేసుకుంటారు. నా దృష్టిలో పెళ్లి అంటే యూనియన్ ఆఫ్ హార్ట్స్ (మనసుల కలయిక). మాది యూనియన్ ఆఫ్ హార్ట్స్’ అని సమాధానం చెప్పుకొచ్చాడు.

నరేష్ ఇచ్చిన సమాధానాన్ని పవిత్ర లోకేష్ తో పెళ్లి జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇద్దరికీ మ్యారేజ్ అయిందని డైరెక్టుగా చెప్పొచ్చుగా? నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నుండి ఆయన ఇంకా విడాకులు తీసుకోలేదు. అఫీషియల్ గా డైవర్స్ తీసుకోకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. అందుకే పెళ్లి జరిగిందని నేరుగా చెప్పకుండా ఇలా ఇన్డైరెక్ట్ గా చెప్పారు నరేష్.