టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టిజియస్ చిత్రాలలో పుష్ప ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా పుష్పను మలుచుతున్నాడు దర్శకుడు సుకుమార్. స్టార్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తున్నటువంటి ఈ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే ఇలాంటి వార్తలు రావడం అనేది అభిమానులకు ఆనందం కలిగించే విషయమే. కానీ ఎప్పుడెప్పుడు అధికారికంగా అప్డేట్ వస్తాయా అని ఆత్రంగా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. పుష్ప చిత్రం ఆల్రెడీ పుష్పారాజ్ టీజర్ తోనే అద్భుతమైన అంచనాలను సెట్ చేసుకుంది.
అలాంటప్పుడు టాలీవుడ్ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అప్డేట్స్ కోరుకోవడంలో తప్పు లేదు. అయితే పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రం కూడా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతుంది. టీజర్ చూసిన వారందరికి ఆల్రెడీ సినిమాలో మెయిన్ థీమ్ ఏంటనేది అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎర్రచందనం కట్ చేయడం.. లారీలలో తరలించడం గురించి క్లియర్ గా చూపించారు. అలాగే లారీలకు అడ్డుపడిన వారిని హీరో ముసుగు ధరించి చితకబాదడం అనేది కూడా చూపించారు.
అయితే ప్రస్తుతం పుష్ప చిత్రం గురించి సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. అందులో ఒకటి అల్లు అర్జున్ కాలికి ఉన్నటువంటి వేళ్ల గురించి టాపిక్. నిజానికి ఇప్పటివరకు విడుదల చేసిన అల్లు అర్జున్ పోస్టర్స్ చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మొదటిసారి రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపించాయి. తర్వాత రిలీజ్ చేసిన లుక్కులో ఐదు వేళ్లు మాత్రమే ఉన్నాయి. మరి తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో బన్నీ కాలికి ఓ వేలు కట్ చేసుకుంటాడని కథనాలు చెబుతున్నాయి. మరి ఈ లెక్కన పుష్పలో అసలు కాలివేళ్ల గోల ఏంటనేది మేకర్స్ తేల్చాలి. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ కాగా మైత్రి మూవీస్ వారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.